Rahane: నా లక్ష్యం నెరవేరేదాకా ఆడుతూనే ఉంటా.. అజింక్య రహానె

రిటైర్మెంట్ వార్తలొస్తున్నవేళ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అజింక్య రహానె. ‘రంజీ ట్రోఫీ సాధించడంతోపాటు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనేది నా పెద్ద లక్ష్యం. ఈ దిశగానే అడుగులు వేస్తున్నా' అన్నాడు. దీంతో వీడ్కోలు పలకట్లేదనే హింట్ ఇచ్చాడని విశ్లేషకులు అంటున్నారు.

Rahane: నా లక్ష్యం నెరవేరేదాకా ఆడుతూనే ఉంటా.. అజింక్య రహానె
New Update

Ajinkya Rahane: టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane) రిటైర్మెంట్ వార్తలు వైరల్ అవుతున్న వేళ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన లక్ష్యం నెరవేరేదాకా రిటైర్మెంట్ (Retirement) ప్రకటించే ప్రసక్తే లేదంటూ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. 2023లో జూలైలో వెస్టిండీస్ పర్యటన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన రహానే పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాంగానే ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న ఆయన.. ముంబై  (Mumbai) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో ఆంధ్రా జట్టుపై ముంబై ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రహానే జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ గురించి ఒపెన్ అయ్యాడు.

100 టెస్ట్ లే లక్ష్యంగా.. 
‘రంజీ ట్రోఫీతోపాటు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనేది నా పెద్ద లక్ష్యం. ఈ దిశగానే ముందడుగులు వేస్తున్నా. ప్రస్తుతానికైతే ముంబై తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంపై దృష్టిపెట్టా. మేం ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాం. ట్రోఫీని గెలవాలంటే టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడాలి. అది సవాలుతో కూడుకున్నది. ఒక్కో మ్యాచ్‌పై దృష్టిపెట్టి ముందుకుసాగుతున్నాం. మేము ఒక సమయంలో ఒక ఆట ఆడాలని చూస్తున్నాం. ఇది హోమ్-అవే ఫార్మాట్ కాబట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ క్షణంలోనే సహనంతో ఉండాలి' అన్నాడు. దీంతో రహానే రిటైర్మెంట్ పై వచ్చిన వార్తలకు చెక్ పడింది.

చిరస్మరణీయ సిరీస్‌..
ఇక ఇప్పటివరకు భారత్‌ తరఫున 85 టెస్టులు ఆడిన 35 ఏళ్ల రహానే.. 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలున్నాయి. 102 క్యాచ్‌లు కూడా పట్టాడు.
2020-21 సీజన్‌లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయం సాధించగా ఈ చిరస్మరణీయ సిరీస్‌కు రహానె కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే ఐపీఎల్ లోనూ చెన్నై తరఫున ఆడుతున్న రహానే కుర్రాళ్లతో పోటీపడుతూ సత్తా చాటుతున్నాడు.

#retirement #ajinkya-rahane #test-100
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe