మా నాన్న తప్పు చేశారు: ముత్తిరెడ్డి కుమార్తె జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సంచనల నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా ప్రకటించారు. By Vijaya Nimma 25 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వెయ్యి కోట్ల ఆస్తి ఉంది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. చేర్యాలలోని పెద్ద చెరువు మత్తడి స్థలానికి ముత్తిరెడ్డి కబ్జా చేశారు. ఆ స్థలాన్ని కూతురు పేరుపై ముత్తిరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. స్థలం కబ్జాపై గతంలో విపక్షాలు ముత్తిరెడ్డిపై మండిపడ్డాయి. తన పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ముత్తిరెడ్డి కూతురు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన పేరుపై ఉన్న 1270 గజాల స్థలాన్ని మున్సిపాటిలీకి అప్పగిస్తానని ముత్తరెడ్డి కుమార్తె తుల్జాభవాని చెప్పారు. స్థలంలో క్షమాపణ కోరుతూ తుల్జా భవాని బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మా నాన్న ఇలా చేసి ఉంటడాల్సింది కాదని తుల్జాభవాని తెలిపారు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని, తప్పు జరిగిందని, మా నాన్న చేసిన పనికి క్షమించాలని ఆ గ్రామస్థులను కోరారు. కోర్టు ద్వారా ఆ స్థలాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తానని ముత్తిరెడ్డి కుమార్తె వివరణ ఇచ్చారు. ఎన్ని నకిలీ పత్రాలపై ఉన్నాయో తెలియదు చేర్యాల పట్టణంలోని సర్వే నంబర్ 1402లో తన పేరు మీద నమోదైన భూమి మత్తడి భూమి అని.. అది ప్రభుత్వ ఆస్తి అని భవానీ చెబుతున్నారు. 2020లో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగిందని.. కానీ 2022 జూలైలో అది లిటిగేషన్‌లో పడినప్పుడు మోసం గురించి తనకు తెలిసిందని అంటున్నారు. హైకోర్టు, లోకాయుక్తలో దాఖలు చేసిన పిటిషన్లనలో కూడా తన సంతకం ఫోర్జరీ చేయబడిందని ఆరోపించారు. తన తండ్రి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తాను లేకుండానే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు. తన నకిలీ సంతకాలు ఎన్ని పత్రాలపై ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆమె చెబుతున్నారు. చాలా పోరాటం తర్వాత నేను చేర్యాల భూమి కాగితాలను పొందగలిగానని తుల్జా భవానీరెడ్డి చెప్పారు. అయితే తన కూతురు ఆరోపణలను ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఖండించారు. చేర్యాలలోని ఆ భూమి ప్రభుత్వ ఆస్తి కాదని పేర్కొన్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రతిపక్షాలు తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి