Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పు చేస్తే డబ్బు పోయినట్టే!

పెట్టుబడి ఎప్పుడూ దీర్ఘకాలికంగా ఉండాలి. అలాకాకుండా కొద్దికాలం కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ వలన ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్టయితే కాంపౌండింగ్ భారీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో ఈ తప్పు చేస్తే డబ్బు పోయినట్టే!
New Update

సాధారణంగా అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే.. ఇన్వెస్ట్ చేసిన తరువాత ఆ పెట్టుబడిని అక్కడే కొద్దికాలం పాటు స్థిరంగా ఉంచితేనే మంచి రాబడి పొందొచ్చు అనే విషయాన్ని మర్చిపోతారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) విషయంలో, ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసిన తరువాత వేచి ఉండటం మరింత ముఖ్యం.  ఎందుకంటే దానిలో కాంపౌండింగ్ భారీ ప్రయోజనం ఉంటుంది.  ఇటీవలి కాలంలో, మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. అయినప్పటికీ, పెట్టుబడిదారులు త్వరగా దాని నుండి బయటకు రావడం వలన చాలా మంది దీని నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. 

ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం, భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds)లో ప్రజలు ఎంత వేగంగా పెట్టుబడి పెడుతున్నారో, వారు అంతే వేగంతో వాటి నుండి నిష్క్రమిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds) లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య 28 శాతానికి పెరిగింది. SIP నుండి ఉపసంహరణ విషయంలో, 54 శాతం వృద్ధి కనిపించింది.

Also Read: భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ 

ఎకౌంట్ క్లోజింగ్స్ పెరిగాయి..
భారతదేశంలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే AMFI తాజా నివేదిక ప్రకారం, 2023-24లో ప్రజలు SIP నుండి రూ. 11 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. 2022-23లో ఈ సంఖ్య రూ.72,100 కోట్లుగా ఉంది. ఈ కారణంగా, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds)లో పెట్టుబడి వృద్ధి చాలా తక్కువగా ఉంది. FY24లో, 4.28 కోట్ల SIP ఎకౌంట్స్ నమోదు అయ్యాయి. ఇది FY23 కంటే 71 శాతం ఎక్కువ. కానీ మరోవైపు 2.24 కోట్ల సిప్ ఖాతాలు మూతపడ్డాయి. ఈ సంఖ్య FY 23 కంటే 56 శాతం ఎక్కువ.

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, సిప్ ద్వారా మొత్తం రూ.20 లక్షల కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds)లోకి వచ్చాయి.  అయితే అంతకుముందు సంవత్సరంలో కేవలం రూ.16 లక్షల కోట్లు మాత్రమే సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చాయి. మనం  SIP వృద్ధిని మాత్రమే పరిశీలిస్తే, 2023-24లో నికర SIP వృద్ధి 4.9 శాతంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రజలు రూ. 87,971 కోట్లను సిప్‌లో పెట్టుబడి పెట్టారు. 2022-23లో ఈ పెట్టుబడి రూ. 83,873 కోట్లు.

నిపుణుల అభిప్రాయం ఇదీ..
సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది నుండి రెండేళ్లలో మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) బలమైన రాబడిని ఇచ్చాయి. అటువంటి పరిస్థితిలో, ప్రజలు భారీ రాబడిని చూసి డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. యువ పెట్టుబడిదారులు స్వల్పకాలంలో భారీ లాభాలను చూసి మ్యూచువల్ ఫండ్స్ నుండి నిష్క్రమిస్తున్నారు అని చెప్పారు.  అయితే ఇది పెట్టుబడికి మెరుగైన మార్గం కాదు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌(Mutual Funds)లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు ఒకటి నుండి రెండు సంవత్సరాల తర్వాత డబ్బు అవసరం అవుతుంది, అప్పుడు మీరు స్మాల్ లేదా మిడ్‌క్యాప్ నుండి డబ్బును విత్‌డ్రా చేసి డెట్ ఫండ్లలో పొదుపు చేస్తే మంచిది అని ఆయన సూచిస్తున్నారు.  మీ లక్ష్యం 10 నుండి 15 సంవత్సరాల దూరంలో ఉంటే, సరైన ఫండ్‌కు కట్టుబడి ఉండటం మంచిది అని ఆయన అంటున్నారు. 

#investments #mutual-funds
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe