Mani Sharma Birthday Special : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే!

సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు మణిశర్మ. తనదైన బాణీలతో ఆడియన్స్ ను ఆకట్టుకొని 'మెలోడి బ్రహ్మ' అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఆయన సంగీత ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఆర్దికల్ లోకి వెళ్ళండి.

New Update
Mani Sharma Birthday Special : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే!

Mani Sharma Birthday Special Story : మెగాస్టార్ మాస్ స్టెప్స్ వేయాలన్నా.. నటసింహం ఊరమాస్ డైలాగ్స్ చెప్పాలన్నా.. కింగ్ కుర్ర హీరోయిన్లని కవ్వించాలన్నా.. విక్టరీ సెంటిమెంట్‌తో కొట్టాలన్నా.. వీటన్నింటి వెనుక మణిశర్మ (Mani Sharma) మ్యూజిక్ ఉండాల్సిందే. తన మ్యూజిక్కే తనకు ప్రాణం. కుర్ర సంగీత దర్శకులు వచ్చాక.. ఒక అడుగు వెనక్కి పడి ఉండవచ్చు.. కానీ మంచి ఛాన్స్ పడితే.. ఇప్పటికీ ఇరక్కొట్టగలనని ‘ఇస్మార్ట్’గా నిరూపిస్తూనే వస్తున్నారు.

publive-image Mani Sharma with his son Swara Saagar Mahathi Photos

చిరంజీవి (Chiranjeevi) కి స్టార్ స్టేటస్‌ని ఇచ్చింది 'ఖైదీ' సినిమా అయితే.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌‌కి కమర్షియల్ స్టేటస్ ఇచ్చింది మణిశర్మ. పాటల కంటే కూడా ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి దర్శకనిర్మాతలు, ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే.. అది మణిశర్మ క్రియేట్ చేసిన హిస్టరీ. అటువంటి హిస్టరీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మెలోడి బ్రహ్మా మణిశర్మ పుట్టినరోజు నేడు (జులై 11). ఈ సందర్భంగా అయన సంగీత ప్రస్థానం గురించి పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

publive-image

Also Read : ‘పొలిమేర 3’ లోడింగ్… అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేసిన మేకర్స్!

రామ్ గోపాల్ వర్మ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా..

మణిశర్మ కృష్ణాజిల్లా మచిలీపట్నం (Machilipatnam) లో జన్మించాడు. ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. తండ్రి వయొలినిస్ట్. చిన్నతనం నుంచే సంగీతం పై మక్కువ పెరిగింది. తండ్రి.. సినిమాల్లో పనిచేయాలని ఫ్యామిలీతో కలిసి మద్రాస్ వెళ్లారు. అక్కడే కీ బోర్డ్ తో పాటు పాశ్చాత్య సంగీతంలో ఇళయరాజాకు, రెహమాన్ కు ఇంకా చాలామందికి గురువైన జాకబ్ జాన్ దగ్గర మణిశర్మ పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నాడు. కీ బోర్డ్ ప్లేయర్ గా ఇళయరాజా, కీరవాణి, రాజ్ కోటిల వద్ద పనిచేశాడు. ఆసమయంలోనే అతనికి రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రామూ తను తీసిన రాత్రి అనే హారర్ సినిమాకు సంగీతం చేయించాడు.

publive-image Mani Sharma with his son Swara Saagar Mahathi Photos

'సమరసింహరెడ్డి' తో ఫస్ట్ బ్రేక్...

మణిశర్మ కు మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) గా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ 'సమరసింహరెడ్డి'. ఈ సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత 'బావగారూ బాగున్నారా' సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. 'చూడాలనివుంది'లోని పాటలు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. సినిమాలలోని 'అలా చూడు ప్రేమలోకం' .. 'నవమి దశమి ' .. 'యమహా నగరి' .. 'అందాల ఆడబొమ్మ' వంటి మెలోడీలు ఆయనకు 'మెలోడీ బ్రహ్మ' అనే బిరుదును తెచ్చిపెట్టాయి. ఫాస్టు బీట్ తో మాస్ ఆడియన్స్ లో పూనకాలు తెప్పించడం, మెలోడీతో క్లాస్ ఆడియన్స్ మనసులకు మంచి గంధం రాయడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 200 వరకు పైగా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక తమిళంలో 25 చిత్రాలు. కన్నడలో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు.

publive-image

పదేళ్లు ఇండస్ట్రీని శాసించి...

1998లో కెరీర్ మొదలుపెట్టిన మణిరత్నం సరిగ్గా పదేళ్ల పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడనే చెప్పాలి. పదేళ్లలో ఎందరో కొత్త సంగీత దర్శకులు వచ్చారు. కానీ మణికి గట్టి పోటీ ఇవ్వలేదు. 2010 తర్వాత మణి మ్యాజిక్ పెద్దగా కనిపించలేదు అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అయినా కొత్త స్టార్స్ తోనూ సరికొత్త మ్యూజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాడు. ఈ మూవీ రీ రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

publive-image

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్ గా...

తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్‌లో తన సినిమాలతో రఫ్పాడించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు,ఇంద్ర, ఒక్కడు,పోకిరి, ఖలేజా, టెంపర్ వంటి సినిమాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇస్మార్ట్ శంకర్ లో తన మాస్ బీజియంతో ఆకట్టుకున్న మణిశర్మ.. త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

publive-image

#tollywood #music-director-mani-sharma #mani-sharma-birthday
Advertisment
Advertisment
తాజా కథనాలు