Mushroom Health Benefits: దేశంలోని చాలా ప్రాంతాల్లో పుట్టగొడుగులను తింటారు. చలికాలంలో పుట్టగొడుగుల తినే వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగులతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే పుట్టగొడుగులు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. పుట్టగొడుగులు (Mushroom )క్యాన్సర్‌ను కూడా నయం చేయగలవని మీకు తెలుసా? అవును.. పుట్టగొడుగులపై చేసిన పరిశోధనలో క్యాన్సర్‌ను నయం చేసే అంశాలు ఉన్నాయని తేలింది. దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో ఈ పరిశోధన సాగుతోంది.
ఇది కూడా చదవండి: హెడ్‌ఫోన్ లేదా ఇయర్‌ఫోన్..? ఈ రెండిటిలో ఏది బెస్ట్?
ఆహారం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని బుందేల్ ఖండ్ యూనివర్సిటీ (Bundelkhand University) బయో మెడికల్ సైన్సెస్ (Biomedical Sciences) విభాగం అధ్యాపకుడు డాక్టర్ బల్బీర్ సింగ్ అన్నారు. మనం తినే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంచి హెల్తీ ఫుడ్ తినడం, తాగడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్స కూడా సాధ్యమవుతుంది. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి: సపోటా పండును డైట్‌లో చేర్చుకోండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!
అనేక రకాల పుట్టగొడుగు(Mushroom )లలో క్యాన్సర్‌ను నయం చేసే అంశాలు ఉన్నాయని కూడా ఒక పరిశోధన వెల్లడించింది. అటువంటి జాతులలో ఒకటి బాటమ్ మష్రూమ్. సులభంగా లభించే ఈ పుట్టగొడుగులో క్యాన్సర్‌ను నయం చేసే అంశాలు కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపడంలో ఉపయోగపడుతుంది. ప్రజలు దీన్ని ప్రతిరోజూ తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.