Murugadoss: మూడేళ్ల తర్వాత రంగంలోకి మురుగదాస్

Murugadoss: మూడేళ్ల తర్వాత రంగంలోకి మురుగదాస్
New Update

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మురుగదాస్ కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. రజనీకాంత్ తో చేసిన దర్బార్ సినిమా మిస్ ఫైర్ అవ్వడంతో, ఈ దర్శకుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కరోనా కూడా బాగా ఇబ్బంది పెట్టింది. అలా లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు మురుగ. ఈసారి శివ కార్తికేయన్ ను సెలక్ట్ చేసుకున్నాడు ఈ స్టార్ డైరక్టర్.

మురుగదాస్, శివకార్తికేయన్‌ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. శ్రీ లక్ష్మి మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దర్శకుడు మురుగదాస్ పుట్టినరోజున అఫీషియల్ గా ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా పిల్లల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో శివకార్తికేయన్, దర్శకుడు ఎఆర్ మురుగదాస్‌ దర్శకత్వంలో పని చేయడం ఇదే తొలిసారి. అందుకే ఈ మేటర్ వైరల్ అయింది.

“డియర్ మురుగదాస్ సార్, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిత్రం నాకు అన్ని విధాలా చాలా ప్రత్యేకమైనది. చిత్రీకరణ ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా ధన్యవాదాలు సార్. మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ శివకార్తికేయన్ పోస్ట్ పెట్టాడు. దానికి మురుగదాస్ కూడా స్పందించాడు. 'కలిసి సినిమాటిక్ మేజిక్' సృష్టిద్దాం అంటూ రియాక్ట్ అయ్యాడు.

ఇంతకుముందు, శివకార్తికేయన్ ను హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించాడు మురుగదాస్. ఆ సినిమా పేరు మాన్ కరాటే. ఆ సినిమాకు కథ కూడా మురుగదాసే అందించాడు. మళ్లీ ఇన్నేళ్లకు శివకార్తికేయన్ ను డైరక్ట్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.

ఎఆర్ మురుగదాస్ మాస్టర్ స్టోరీటెల్లర్, వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు. ఆయన చిత్రాలు మాస్ లీడ్ నటులకే కాదు, ప్రాజెక్ట్‌లో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒక చిన్న విరామం తర్వాత మురుగదాస్ ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్‌తో తిరిగి వచ్చారు. ప్రస్తుతం, ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమాలో శ్రీలీల లేదా పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

#gap #unannounced #after-three-years #movie #corona #murugadoss #sivakarthikeyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe