Murder Mystery : చనిపోయాడనుకుంటే ఫోన్‌ చేశాడు.. ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు!

చనిపోయాడనుకుని కర్మకాండలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు కుటుంబ సభ్యులు. పోలీసుల వద్ద నుంచి మృతదేహాన్ని తీసుకోవడమే తరువాయి. ఇంతలో నేను బతికే ఉన్నాను అంటూ చనిపోయాడు అనుకుంటున్న వ్యక్తి వద్ద నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు షాక్‌ అయ్యారు.

New Update
Murder Mystery : చనిపోయాడనుకుంటే ఫోన్‌ చేశాడు.. ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు!

East Godavari : చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే నేను బతికే ఉన్నాను.. నన్ను ఎవరో కొట్టి పారేశారంటూ చనిపోయాడునుకున్న వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. అంతే ఒక్కసారిగా బంధువులంతా ఉలిక్కిపడ్డారు. సినిమా స్టోరీ(Cinema Story) ని తలపించే ఈ మిస్టరీ మర్డర్‌ సీన్‌(Murder Scene) తూర్పు గోదావరి(East Godavari) జిల్లా రంగంపేట(Rangampet) మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే... తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య(Kethamalla Poosaiah) ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం కూడా తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాన్మ్‌ఫార్మర్‌ వద్ద మంటలు రావడం చుట్టు పక్కల పొలాలు వారు గమనించారు.

వారు అక్కడికి చేరుకునే సమయానికి ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద ఓ వ్యక్తి తగలబడిపోతూ కనిపించాడు. దీంతో వారు ఆ వ్యక్తి పూసయ్యే అని నిర్థారించుకుని పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులకు అందించారు.

దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోపు పూసయ్య కుటుంబంలోని ఓ వ్యక్తికి గుర్తు తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. అతను ఫోన్‌ ఎత్తి మాట్లాడగా అవతల వ్యక్తి నేను పూసయ్యను అంటూ తెలిపాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

Also Read : Breaking : ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు!

వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కూడా ఖంగుతిన్నారు. అసలు మాట్లాడుతుంది పూసయ్య కాదా అనే విషయాన్ని నిర్థారించుకోగా అతను పూసయ్యే అని తెలిసింది. దాంతో వారంతా అతనిని తీసుకుని రావడానికి వెళ్లారు. ఇంటికి చేరుకున్న పూసయ్య జరిగిన విషయాన్ని అక్కడ ఉన్నవారందరికీ తెలియజేశాడు.

శుక్రవారం ఉదయం పూసయ్య పొలం వద్దకు వెళ్లే సరికి ఎవరో ముగ్గురు వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఏదో పని చేస్తూ కనిపించారు. దీంతో పూసయ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు తనను కొట్టి ఆటోలో రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో పడేశారని తెలిపాడు. తీవ్రగాయాలతో బాధపడుతున్న తనకి ఓ వ్యక్తి సాయం చేసి తన ఇంటికి ఫోన్‌ చేసేందుకు ఫోన్‌ ఇచ్చినట్లు వివరించాడు. దీంతో పూసయ్య బతికే ఉన్నందుకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పూసయ్య బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. మరి చనిపోయిన వ్యక్తి ఎవరూ అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. క్లూస్‌ టీంలను, డాగ్‌ లను పోలీసులు రంగంలోకి దించారు. ఈ ఘటన మొత్తం కూడా మిస్టరీ(Mystery) గా మారింది. ఈ ఘటన గురించి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని రంగంపేట ఎస్సై విజయ్‌ కుమార్‌ వివరించారు.

ఇంతకీ పూసయ్య పొలంలో హత్యకు గురైందిఎవరు? ఆ ముగ్గురు నిందితులు ఎవరు? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? పెట్రోల్ తో మృతదేహన్ని కాల్చితే పోలీసులు ఎందుకు విద్యుదాఘాతానికి గురైనట్లు నిర్థారించుకున్నారని కూడా తెలియాల్సిన విషయాలు.

Also Read : రేవంత్ రెడ్డి కేబినెట్‌లోకి ప్రొఫెసర్ కోదండరాం? ఆ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్!

Advertisment
తాజా కథనాలు