Mareddy Srinivas: ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడిపై హత్యాయత్నం ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తిపోట్లతో దుండగులు తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 20 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Mareddy Srinivas Reddy: ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. ఏపీ తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తి పోట్లతో దుండగులు తీవ్రంగా గాయపరిచారు. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఆయనను హుటాహుటినా ఒంగోలు సంఘమిత్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. Also Read: బాలకృష్ణ డైలాగులు చెప్పకు.. చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్..! కాగా, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్లాన్ ప్రకారమే దుండగులు దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Also Read: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..! బాపట్ల తెలుగుదేశం టికెట్ రేసులో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని.. తన ప్రత్యర్థులు ఒంగోలు లో జేమ్స్ హాస్పిటల్ అధినేత రామకృష్ణ రెడ్డితో చేతులు కలిపి ఈ దాడి చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. #andhra-pradesh #mareddy-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి