మెదక్‌ జిల్లా దారుణం..క్రికెట్ బెట్టింగ్‌లతో విద్యార్థి ఆత్మహత్య

స్మార్ట్ ఫోన్ వచ్చాక మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మోసపోవడం అనేది ఇప్పటి ట్రెండింగ్‌కు చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతీ కుటుంబంలోనూ విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబంలో ఇలాంటి ఘటన ఒకటి విషాదాన్ని నిప్పింది.

మెదక్‌ జిల్లా దారుణం..క్రికెట్ బెట్టింగ్‌లతో విద్యార్థి ఆత్మహత్య
New Update

ప్రాణాలు తీసిన బెట్టింగ్

డబ్బు సంపాదించాలని చాలామందికి ఉంటుంది. దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈమధ్య ఆన్‌లైన్‌లో ఈజీగా సంపాదించుకోవడం అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. దాని ట్రెండింగ్‌కి అలవాటు పడినవారు చాలామంది ఇబ్బందుల్లో ఇరుక్కున్న ఘటనలు మనం చూస్తేనే ఉన్నాము. అలాంటి ఘటన ఒకటి మెదక్ జిల్లాలో చోటు చేసుకున్నది. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు ఓ విద్యార్థి. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లి తండాలో నెలకొన్నది. గతేడాది ఐపీఎల్‌లో బెట్టింగ్‌లో ఐదు లక్షల రూపాయాలు వరకు అప్పు చేశాడు మురళి అనే విద్యార్థి. ఢిల్లీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న మురళి గత నెల 24న ఇంటికి వచ్చాడు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనంతో తండా చివరిలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చేసిన అప్పులు తీర్చలేక

ఇలాంటి క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తేనే ఉన్నాము. అప్పులపాలైన వారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గతేడాది ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహించి పెద్ద ఎత్తున నష్టపోయినవారు చాలా మంది ఉన్నారు. అప్పులు తీర్చలేకనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడి ఆన్‌లైన్‌ వాటికి మోసపోవద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా చాలామంది ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ రకంగా మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా యువత ఆన్‌లైన్‌ ట్రెండింగ్‌కు ఎక్కువగా నమ్మకుండా ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేద్దాం. ఎక్కువగా అలవాటు పడితే ప్రాణాలు కాపాడుకోవాలని కష్టమని చెప్పక తప్పదు.

కుటుంబంలో విషాదం

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మురళి ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు కలుపుకున్నాయి. ఎంతో చదువుకొని తల్లిదండ్రులను కాపాల్సిన విద్యార్థి అప్పులపాలై ఇలా ప్రాణాలు కోల్పోవడంతో అందరిలో విషాదాన్ని నిప్పింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe