Ranji Trophy 2024: 42వ సారి.. రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై!

2023-24 రంజీ ట్రోఫీని ముంబై కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి 42వ సారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. ముషీర్‌ ఖాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, తనీష్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌ దక్కింది.

New Update
Ranji Trophy 2024: 42వ సారి.. రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న ముంబై!

Mumbai Win 42nd Ranji Trophy Title: రంజీ ట్రోఫీలో తిరుగులేని ముంబై మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. 2023-24 రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో ఓడించి 42వ సారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. మొదట్లో వన్ సైడ్ గా సాగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగినప్పటికీ ముంబై పై చేయి సాధించి తిరుగులేని విజేతగా నిలిచింది.

పోరాడిన విదర్భ..
ఈ మేరకు 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బ్యాటర్లలో కెప్టెన్‌ ఆక్షయ్‌ వాద్‌కర్‌(102), కరుణ్‌ నాయర్‌(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపు తీరాలకు చేర్చలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్‌ కొటియన్‌ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్‌ దేశ్‌ పాండే, ముషీర్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ధావల్‌ కులకర్ణి, సామ్స్‌ ములానీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి: GAVASKAR: యశస్వి జైస్వాల్ ను మందలించిన గవాస్కర్!

పేలవ ప్రదర్శన..
ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. తనీష్‌ కొటియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్‌ తలా 3 వికెట్లతో విధర్బను దెబ్బతీశారు.

Advertisment
తాజా కథనాలు