రెండు రూపాయల లిప్‌స్టిక్ కోసం ల‌క్ష పోగొట్టుకున్న యువతి

ఆన్ లైన్ లో లిపిస్టిక్ ఆర్డర్ చేసిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. మూడు వందల లిప్ట్ స్టిక్ కోసం లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఆర్డర్ హోల్డ్‌లో పెట్టామ‌ని రూ. 2 పేమెంట్ చేయాలని చెప్పడంతో గుడ్డిగా నమ్మి మోసగాడి వలలో చిక్కింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది.

రెండు రూపాయల లిప్‌స్టిక్ కోసం ల‌క్ష పోగొట్టుకున్న యువతి
New Update

ప్రపంచవ్యాప్తంగా సైబ‌ర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రజ‌ల్లో పోలీసులు, అధికారులు ఎంత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయ‌కుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు నేర‌గాళ్లు. తాజాగా ఓ యువతి లిప్ స్టిక్ ఆర్డర్ చేస్తూ దారుణంగా మోసపోయిన ఇష్యూ ముంబైలో చోటుచేసుకుంది. మూడు వందల లిప్ స్టిక్ కోసం కేవలం రెండు రూపాయలు పేమెంట్ చేయాలని, అందుకోసం ఓ లింక్ పంపించాడు మోసగాడు. దీంతో తొందరపడిన మహిళ రెండు రూపాయలే కదా అని లైట్ తీసుకుంది. కానీ చివరికీ దారుణంగా మోసపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

Also read :వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Online Scam : ఈ మేరకు ముంబై సైబర్ పోలీలుసు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఓ మ‌హిళ లిప్‌స్టిక్ ఆర్డర్ ఇస్తూ త‌న బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ. లక్ష పోగొట్టుకుంది. న‌వంబ‌ర్ 2న న‌గ‌రానికి చెందిన డాక్టర్ ఈ-కామ‌ర్స్ సైట్‌లో రూ. 300 విలువ చేసే లిప్‌స్టిక్ ఆర్డర్ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆర్డర్ రిసీవ్ చేసుకోకున్నా పార్సిల్ డెలివ‌రీ చేసిన‌ట్టు మ‌హిళ‌కు కొరియ‌ర్ కంపెనీ నుంచి మెసేజ్ వ‌చ్చింది. దీంతో ఆమె కంపెనీని సంప్రదించ‌గా కొద్దిసేప‌ట్లో మిమ్మల్ని క‌స్టమ‌ర్ కేర్ ప్రతినిధి సంప్రదిస్తార‌ని బ‌దులిచ్చారు. ఆపై ఓ వ్యక్తి నుంచి మ‌హిళ‌కు కాల్ వ‌చ్చింది. మీ ఆర్డర్ హోల్డ్‌లో పెట్టామ‌ని రూ. 2 పేమెట్ చేయాల్సి ఉంటుంద‌ని స‌ద‌రు వ్యక్తి న‌మ్మబలికాడు. ఆమె త‌న బ్యాంక్ వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల‌ని చెబుతూ కాల‌ర్ ఓ వెబ్‌లింక్ పంపాడు.

అయితే ఈ కాల్ నిజ‌మైన‌దేన‌ని న‌మ్మిన సదరు మ‌హిళ లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. ఆపై కాల‌ర్ సూచించిన విధంగా రూ. 2 చెల్లించింది. ఇక ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 95,000, రూ. 5000 డెబిట్ అయ్యాయ‌ని మ‌హిళ‌కు నోటిఫికేష‌న్స్ వ‌చ్చాయి. దీంతో మోస‌పోయాన‌ని గ్రహించిన మ‌హిళ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా ఆన్ లైన్ కస్టమర్లను కలవరపెడుతుంది.

#lipstick #mumbai-girl #lost-rs-1-lakh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe