రెండు రూపాయల లిప్‌స్టిక్ కోసం లక్ష పోగొట్టుకున్న యువతి ఆన్ లైన్ లో లిపిస్టిక్ ఆర్డర్ చేసిన ఓ మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. మూడు వందల లిప్ట్ స్టిక్ కోసం లక్ష రూపాయలు పోగొట్టుకుంది. ఆర్డర్ హోల్డ్‌లో పెట్టామని రూ. 2 పేమెంట్ చేయాలని చెప్పడంతో గుడ్డిగా నమ్మి మోసగాడి వలలో చిక్కింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. By srinivas 24 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రజల్లో పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆన్‌లైన్ వేదికగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు నేరగాళ్లు. తాజాగా ఓ యువతి లిప్ స్టిక్ ఆర్డర్ చేస్తూ దారుణంగా మోసపోయిన ఇష్యూ ముంబైలో చోటుచేసుకుంది. మూడు వందల లిప్ స్టిక్ కోసం కేవలం రెండు రూపాయలు పేమెంట్ చేయాలని, అందుకోసం ఓ లింక్ పంపించాడు మోసగాడు. దీంతో తొందరపడిన మహిళ రెండు రూపాయలే కదా అని లైట్ తీసుకుంది. కానీ చివరికీ దారుణంగా మోసపోయానని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. Also read :వరుడి మెడలో కరెన్సీ నోట్ల దండ.. విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు Online Scam : ఈ మేరకు ముంబై సైబర్ పోలీలుసు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన ఓ మహిళ లిప్‌స్టిక్ ఆర్డర్ ఇస్తూ తన బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ. లక్ష పోగొట్టుకుంది. నవంబర్ 2న నగరానికి చెందిన డాక్టర్ ఈ-కామర్స్ సైట్‌లో రూ. 300 విలువ చేసే లిప్‌స్టిక్ ఆర్డర్ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆర్డర్ రిసీవ్ చేసుకోకున్నా పార్సిల్ డెలివరీ చేసినట్టు మహిళకు కొరియర్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె కంపెనీని సంప్రదించగా కొద్దిసేపట్లో మిమ్మల్ని కస్టమర్ కేర్ ప్రతినిధి సంప్రదిస్తారని బదులిచ్చారు. ఆపై ఓ వ్యక్తి నుంచి మహిళకు కాల్ వచ్చింది. మీ ఆర్డర్ హోల్డ్‌లో పెట్టామని రూ. 2 పేమెట్ చేయాల్సి ఉంటుందని సదరు వ్యక్తి నమ్మబలికాడు. ఆమె తన బ్యాంక్ వివరాలను పొందుపరచాలని చెబుతూ కాలర్ ఓ వెబ్‌లింక్ పంపాడు. అయితే ఈ కాల్ నిజమైనదేనని నమ్మిన సదరు మహిళ లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. ఆపై కాలర్ సూచించిన విధంగా రూ. 2 చెల్లించింది. ఇక ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 95,000, రూ. 5000 డెబిట్ అయ్యాయని మహిళకు నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా ఆన్ లైన్ కస్టమర్లను కలవరపెడుతుంది. #lipstick #mumbai-girl #lost-rs-1-lakh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి