IPL 2024: చివరి మ్యాచ్ లోనూ ఓటమితో.. ఐపీఎల్ నుంచి ముంబాయి అవుట్!

ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ ఆడిన ముంబయి జట్టు పరాజయంతో టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. లక్నోతో జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ 67వ మ్యాచ్ లో ముంబయి జట్టు లక్నో జట్టు ఇచ్చిన 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. మరోవైపు లక్నో విజయంతో తన చివరి మ్యాచ్ ముగించింది.  

IPL 2024: చివరి మ్యాచ్ లోనూ ఓటమితో.. ఐపీఎల్ నుంచి ముంబాయి అవుట్!
New Update

IPL 2024: ఐపీఎల్ లో ముంబాయి జట్టు తన చివరి మ్యాచ్ ను పరాజయంతో ముగించింది. రోహిత్ శ్రమ పడినా.. అది ముంబాయి విజయానికి సరిపోలేదు. ఐపీఎల్ 67వ మ్యాచ్ ముంబాయి ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ముంబైకి 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని ముంబాయి ఛేదించలేకపోయింది. లక్నో తరఫున 29 బంతుల్లో 75 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడిన నికోలస్ పురాన్ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా 55 పరుగులు చేసి లక్నో మంచి స్కోర్ సాధించడానికి సహాయపడ్డాడు. 

రోహిత్ - నమన్ ధీర్ శ్రమ విఫలం..

IPL 2024: 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబాయి ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. పవర్‌ప్లేలో రోహిత్ శర్మ లయలో కనిపించి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. తొమ్మిదో ఓవర్‌లో 88 పరుగుల స్కోరు వద్ద జట్టు తొలి వికెట్ పడింది.  ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. తొలుత డెవాల్డ్ బ్రీవిస్ ఔట్ కాగా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రోహిత్ శర్మ ఔటయ్యాడు. దీంతో ఆ జట్టు 132 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సీజన్‌లోని చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  అయితే ఇది విజయాన్ని అందించలేకపోయింది. చివర్లో, నమన్ ధీర్ కూడా 28 బంతుల్లో 62 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించడానికి ప్రయత్నించాడు, అయితే అతను కూడా ముంబయి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.  నికోలస్ పురాణ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

Also Read:  టీ20 వరల్డ్ కప్.. వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే..

IPL 2024: ముంబాయి ఇండియన్స్ -లక్నో సూపర్‌జెయింట్‌లకు ఇది చివరి ఐపీఎల్ 2024 మ్యాచ్. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ఇరు జట్లు నిష్క్రమించాయి. ఈ మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ కలిసి అవుట్ అయ్యారు. లక్నో తరఫున ఆడుతున్న అన్నయ్య కృనాల్ పాండ్యా తన జట్టుకు మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను బ్యాట్‌తో 7 బంతుల్లో 12 పరుగులు అందించాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. మరోవైపు అతని తమ్ముడు హార్దిక్ పాండ్యా బ్యాడ్ ఫామ్ కొనసాగి మరోసారి విఫలమయ్యాడు. బౌలింగ్ చేస్తూ 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చాడు. అదే సమయంలో బ్యాట్‌తో కూడా మ్యాజిక్‌ను ప్రదర్శించలేకపోయాడు. 13 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ నిష్క్రమించాడు.

#cricket #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe