అంబానీ...లగ్జరీకి బ్రాండ్ అంబాసిడర్లు. భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో ముకేశ్ అంబానీ కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ వంటి ఎక్స్ పెన్సివ్ కార్లు వీళ్ళ జియో గ్యాలరీలో కొలువుదీరి ఉంటాయి.తాజాగా ఇందులోకి మరో కాస్ట్‌లీ కారు గ్యారేజీలోకి చేరింది. ఈ కారుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ బ్లాక్‌బ్యాడ్జ్ కారు. ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్ లో వెళుతున్న ఈ కారు ఖరీదు అక్షరాలా 10 కోట్లు. దీనిని ముఖేష్ అంబానీ భార్య నేత అంబానీ ఇటీవలే కొనుగోలు చేశారు. గోల్డ్ షెడ్ లో కనిపించే ఈ కారు సాధారణ కార్ల కంటే చాలా ఆకర్షణయంగా ఉంటుంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజన్, కల్లినన్ 5000 ఆర్పీఎమ్ వద్ద 563 బీహెచ్పీ పవర్, 1600 ఆర్పిఎం, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందీ కారు. ఈ కారు ఏకంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగెట్టగలదు. ఇక రోల్స్ రాయల్స్ కారులో లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్ తో, లెదర్ అపోల్స్టే బ్లాక్ కలర్ స్కీమ్ కలిగి ఉంటుంది.
నీతా అంబానీ ఈ కొత్త కారులో ప్రయాణించిన వీడియోను CS 12 Vlogs యూట్యూ్బ్ ఛానల్ పోస్ట్ చేసారు.రోల్స్ రాయిస్ కల్లినన్ కారు 22 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి. ఈ కారలో ఫ్రంట్ గ్రిల్ సరౌండ్, సైడ్ ప్రేమ్ ఫినిషర్లు, బూట్ హ్యాండిల్, బూట్ ట్రిమ్, లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ ఫినిషర్ మరియు ఎగ్జాస్ట్ పైప్‌లపై డార్కెస్ట్ క్రోమ్ వినియోగించారు. ఈ కారు ఇప్పటి వరకు ఇద్దరి దగ్గరే ఉంది. మొదటిది బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ దగ్గర ఉంటే రెండోది ముఖేష్ అంబానీ దగ్గర ఉంది.