Muhurat Trading: ముహూర్త్ ట్రేడింగ్ శుభప్రదం.. లాభ పడిన స్టాక్ మార్కెట్.. 

దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో నిర్వహించే ముహూర్త్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో ముగిసింది. స్టాక్ మార్కెట్లో ప్రతి దీపావళి రోజున సాయంత్రం ఒక గంట పాటు ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే ఫలితాలు ఏడాది మొత్తం ప్రతిఫలిస్తాయని నమ్ముతారు. 

New Update
Muhurat Trading: ముహూర్త్ ట్రేడింగ్ శుభప్రదం.. లాభ పడిన స్టాక్ మార్కెట్.. 

:Muhurat Trading: దీపావళి పండుగకు స్టాక్ మార్కెట్ లో సంప్రదాయాన్నీ అనుసరించి ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది. ఆరోజు ఒక్క గంట అంటే సాయంతరం 6:15 నుంచి 7:15 గంటల వరకూ ఈ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముహూర్త్ ట్రేడింగ్ సమయంలో స్టాక్ మార్కెట్ లో వచ్చే ఫలితం సంవత్సరం అంతా ప్రతిఫలిస్తుందని ట్రేడర్స్ నుంచి సామాన్య ఇన్వెస్టర్స్ వరకూ భావిస్తారు. ఈ సంవత్సరం కూడా సంప్రదాయం ప్రకారం ముహూర్త్  ట్రేడింగ్ జరిపారు. ఈ సమయంలో సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో ముగిసింది. ఈ సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ తన ఫాలోయర్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్‌లో ముహూర్తపు ట్రేడింగ్(Muhurat Trading) లో సెన్సెక్స్ 354.77 పాయింట్ల (0.55%) లాభంతో 65,259.45 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 100.20 పాయింట్లు లాభపడి 19,525.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 లాభాల్లో ఉన్నాయి.

కోల్ ఇండియా, యుపిఎల్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, విప్రో మరియు ఎన్‌టిపిసి సహా 43 నిఫ్టీ-50 స్టాక్స్ పెరిగాయి. బ్రిటానియా, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ మరియు బిపిసిఎల్‌తో సహా 7 నిఫ్టీ స్టాక్‌లు క్షీణించాయి.

గతంలో ముహూర్త్  ట్రేడింగ్ ఇలా.. 

గతేడాది ముహూర్తపు ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 525 (0.88%) పాయింట్లు పెరిగి 59,832 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 154 పాయింట్ల పెరుగుదలను చూసింది. 17,731 వద్ద ముగిసింది. మనం గత 5 సంవత్సరాల గురించి చూసినట్లయితే, అంటే 2018 నుంచి  2022 వరకు, స్టాక్ మార్కెట్ ప్రతిసారీ లాభాలతో ముగిసింది.

 2018లో సెన్సెక్స్ 295 పాయింట్లు, 2020లో 195 పాయింట్లు, 2019లో 192 పాయింట్లు - 245 పాయింట్ల పెరుగుదలతో 2021 సంవత్సరాన్ని ముగించింది. 2017, 2016లో మార్కెట్‌లో క్షీణత కనిపించింది. 194 పాయింట్ల వద్ద, 11 పాయింట్ల నష్టంతో ముగిసింది.

Also Read: రష్యా నుంచి ఆయిల్.. లాభాలే లాభాలు.. ఎన్ని వేల కోట్లంటే.. 

ఈరోజు స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపే అంశాలు.. 

ఇక ఈరోజు అంటే నవంబర్ 13న స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేయవచ్చు అనే అంశాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు  నేడు విడుదల కానున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉన్నందున ఇది 5% కంటే తక్కువకు తగ్గుతుందని అంచనా. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో వరుసగా రెండో నెలలో క్షీణించి 5.02% వద్ద ఉంది.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) ఫలితాలను ఈరోజు అంటే సోమవారం (నవంబర్ 13) ప్రకటిస్తుంది. ఇది కాకుండా, మణప్పురం ఫైనాన్స్ - NRB బేరింగ్స్ ఫలితాలు కూడా విడుదల అవుతాయి. 

ఈరోజు స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల ఉండవచ్చు. ఆదివారం సెన్సెక్స్ 354.77 పాయింట్ల (0.55%) పెరుగుదలతో 65,259.45 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 100.20 పాయింట్లు లాభపడి 19,525.55 వద్ద ముగిసింది.

Watch this interesting video:

Advertisment
Advertisment
తాజా కథనాలు