/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mudragada-padmanabham--jpg.webp)
కిర్లంపూడిలోని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) నివాసం వద్ద కోలాహలం నెలకొంది. న్యూ ఇయర్ వేళ శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కాపు నేతలు తరలివచ్చారు. ముద్రగడ వైసీపీలో చేరుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కొడుకు చల్లారావుతో కలిసి వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను కూడా బరిలో ఉంటానంటూ ముద్రగడ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: JSP: ‘కేంద్రం డబ్బులు కొట్టేసి మీ బిల్డప్ ఏంటి? దవడలు పగిలిపోతాయి’ జోగి రమేష్ కు జనసేన నేత వార్నింగ్.!
ముద్రగడను రాజ్యసభకు..కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే.. ముద్రగడ మాత్రం వైసీపీలో చేరికపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేయడంపై జోరుగా చర్చ సాగుతోంది. రెండ్రోజుల్లో ముద్రగడ రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముద్రగడ కుమారుడు చల్లారావు తాను నాన్న బాటలో నడిచేందుకు రెడీగా ఉన్నానంటూ సంచలన ప్రకటన చేశారు.
ఇప్పటివరకు బిజినెస్‌లతో బిజీగా ఉన్నానని ఇక నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటానని తెలిపారు. న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు పెద్ద సంఖ్యలో నేతలు రావడం హ్యాపీగా ఉందన్నారు.