MS Swaminathan: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూత భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. By Vijaya Nimma 28 Sep 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్ నేడు ఉదయం 11.30గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన స్వామినాథన్.. తుదిశ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు. స్వామినాథన్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌ని తెరపైకి తీసుకురావడంతో పాటు అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. అంతేకాదు.. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది. 1925 ఆగష్టు 7వ తేదీన జన్మించిన ఎమ్ఎస్ స్వామినాథన్ పద్మశ్రీ, పద్మ విభూషణ్, రామన్ మెగసెసె వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై దృష్టి ఎంఎస్ స్వామినాథన్ పూర్తి పేరు మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా పేర్కొంటారు. రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించి దాని చైర్మన్‌గా ఎంఎస్.స్వామినాథన్ వ్యవహరిస్తున్నారు. అయితే ప్రపంచంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు స్వామినాథన్. అంతేకాదు.. ఇతర దేశాలకు చెందిన ఎన్నో మేలైన వరి రకాలను మన దేశంలోకి ప్రవేశపెట్టారు. వాటి నుంచి కొత్త వరి రకాలను ఉత్పత్తి చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఎంఎస్ స్వామినాథన్ జరిపిన విశేష కృషి చేశారు. దాని వలన భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఎన్నో గొప్ప పదవులను స్వామినాథన్ సమర్ధవంతంగా నిర్వహించారు. వరల్డ్ సైన్స్ అవార్డు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు.1971లో రామన్ మెగసెస్సే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 1972-79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా పనిచేసాడు. 1979 నుంచి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అతను అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు1982-88 వరకు డైరక్టర్ జనరల్‌గా తన సేవలనందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా ఉన్నారు. కాగా, శాస్త్రవేత్త ఎమ్‌ఎస్ స్వామినాథన్ మరణవార్త తెలిసిన తమిళనాడు ప్రముఖులు పార్థీవ దేహాన్ని సందర్శించి, నివాళులార్పించారు. #ms-swaminathan #passed-away-today #mukha-agronomist #private-hospital-in-chennai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి