MS Swaminathan: కరువుని నిర్మూలించిన హరిత విప్లవ పితామహుడు గురించి ఆసక్తికర విషయాలు
కరువుని మనదేశంలో నామరూపాలు లేకుండా చేసిన మనిషి ఎమ్ఎస్ స్వామినాథన్. హరిత విప్లవానికి పితామహుడిగా పేరున్న ఆయనని భారతరత్నగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కరువుని మనదేశంలో నామరూపాలు లేకుండా చేసిన మనిషి ఎమ్ఎస్ స్వామినాథన్. హరిత విప్లవానికి పితామహుడిగా పేరున్న ఆయనని భారతరత్నగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రం భారత రత్న ప్రకటించింది. స్వామినాథన్ తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తో పాటు మరో మాజీ ప్రధాని తెలుగువాడు అయినటువంటి పీవీ నరసింహరావుకు కూడా భారత రత్న ప్రకటించారు.
భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.