MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!

ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన తొలి మ్యాచులో అనూక్ రావత్ ను రనౌట్ చేసి..ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

New Update
MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!

IPL MS Dhoni :  ఐపీఎల్ 2024(IPL 2024) లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక రనౌట్లు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(RCB) తో జరిగిన తొలి మ్యాచులో అనూక్ రావత్ ను రనౌట్ చేసి..ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు ధోని.

ఇప్పటి వరకు మొత్తం 251 ఐపీఎల్ మ్యాచులు ఆడిన ధోనీ.. తాజా రనౌట్ తో కలిపి 24రనౌట్లు చేశాడు. అంతకుముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా(Ravindra Jadeja) పేరున ఉంది. జడేజా 227 ఐపీఎల్ మ్యాచులు ఆడి మొత్తం 23 రనౌట్స్ చేశాడు. తాజా రనౌట్ తో జడేజా ఆల్ టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేసి ఈ ఘనత సాధించాడు.

కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు ముందు చెన్నైసూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతను నంచి ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతరాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు ధోనీ. రుతురాజ్ సారథ్యంలో ఈ సీజన్ లో సీఎస్కే బోణీ కొట్టింది. తొలి మ్యాచులో ఆర్సీబీ(RCB) పై ఆరు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.

ఇది కూడా చదవండి : ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలపై రాని క్లారిటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు