MS Dhoni: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ధోనీ కొట్టిన సిక్స్ గుర్తుందా? ఇప్పటికీ ఆ షాట్ అభిమానుల కళ్ల ముందు తిరుగుతూనే ఉంటుంది. ధోని సిక్స్ కొట్టిన బ్యాట్‌ వేలంలో గిన్నిస్‌ బుక్ రికార్డు క్రియేట్ చేసింది.

MS Dhoni: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?
New Update

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి ధోనీ లైఫ్ గురించి కాదండోయ్.. ఆయన సిక్సర్లు కొట్టిన బ్యాట్ గురించి. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో MSD కొట్టిన సిక్సర్ గుర్తుంది కదా.. అంత ఈజీగా ఎలా మర్చిపోతారలేండి. ఇండియాకు సుదీర్ఘకాలం తర్వాత వరల్డ్‌కప్ తెచ్చిన సిక్సర్ అది. ఆ సిక్స్ కొట్టిన ధోనీ బ్యాట్‌కు లండన్‌లోని ఓ చారిటీ ఈవెంట్‌లో వేలం వేశారు. వేలంలో ఈ బ్యాట్ ఏకంగా రూ.83లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెనీ భారీ ధరకు బ్యాట్‌ను కొనుగోలు చేసింది.

ఈ డబ్బును ధోనీ సతీమణి సాక్షి ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఫౌండేషన్‌ కోసం ఖర్చుచేయనుంది. మరోవైపు ఈ బ్యాట్‌కు వేలంలో భారీ ధర పలకడంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా గిన్నిస్ వరల్డ్‌ రికార్డు బుక్‌లో సైతం చోటు దక్కించుకుంది. అయితే ఈ వార్తలను ధోనీ సన్నిహితులు కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది. అవన్నీ రూమర్స్ అని చెబుతున్నారట.

ఇక ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. క్రీజులో ఉన్నాడంటే ఇండియా ఓడిపోయే మ్యాచ్ అయినా విజయం సాధించాల్సిందే. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ప్రత్యర్థుల ఆశలను సిక్సర్లతో చెరిపేయడం ధోనీ స్టైల్‌. ఇలా ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో సిక్సర్ల వీరుడు, బెస్ట్ ఫినిషర్ అని పేరు సంపాదించాడు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50ఓవర్లలో 274 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంక ఫాస్ట్ బౌలర్ లసిత్‌ మలింగ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ తీశాడు.

అయితే తర్వాత గంభీర్‌తో కలిసి ధోనీ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లో సిక్సర్‌ కొట్టి భారతీయుల కళను సాకారం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఆడిన షాట్‌ ఎవర్‌గ్రీన్‌గా నిలిపోయింది. ఆ మ్యాచ్‌లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. 1983 తర్వాత 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్‌ తెచ్చిపెట్టాడు. ఆ సమయంలో మాజీ క్రికెటర్ రవిశాస్త్రి చెప్పిన "Dhoni finishes off in style!" కామెంటరీ ఇప్పటికీ జనాల చెవుల్లో మార్మోగుతూనే ఉంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe