MS Dhoni playing golf with Donald Trump: ఎంఎస్ ధోని చేయలేనిది ఏదైనా ఉందా? ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మానేసినప్పటికీ, ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఇటీవలే తన జట్టును ఐపీఎల్(IPL) విజేతగా నిలిపాడు. 2024 ఐపీఎల్‌లో కూడా తిరిగి జట్టుకు నాయకత్వం వహిస్తానని ధృవీకరించాడు. ఇది ఆఫ్-సీజన్ కావడంతో, ధోని ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. సమయాన్ని హ్యాపీగా గడుపుతున్నాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో షికార్లు చేస్తున్నాడు. చెన్నై కెప్టెన్ ఇటీవల US ఓపెన్ మ్యాచ్‌లో కనిపించాడు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి గోల్ఫ్ గేమ్ ఆడేందుకు ఆహ్వానం అందుకున్నాడు. ధోనీ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో కనిపించాయి అవి కాస్త వైరల్‌గా మారాయి.
Also Read: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో 4లక్షల టికెట్లు రిలీజ్
రిటైర్ అయినా ఐపీఎల్ ఆడుతున్నాడు అది చాలు:
రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పని చేయడం నుంచి ధోని దేశపు అతిపెద్ద ట్రోఫీ కలెక్టర్‌గా మారే వరకు అతను వేసిన ప్రతి అడుగు ఒక సంచలనమే. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2007, ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ICC World Cup) 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013కి కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. నిస్సందేహంగా క్రికెట్ చూసిన గొప్ప కెప్టెన్లలో ధోని (MS Dhoni) ఒకడు. ఇక ఈ వికెట్ కీపర్-బ్యాటర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అసలు సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్టులు కూడా చేయడు. కానీ అతని అభిమానులు మాత్రం పోస్టులు చేస్తారు. ధోని ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయినప్పటికీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జట్టును గెలిపిస్తున్నాడు. సిక్సర్లతో అభిమానులను హ్యాపీ చేస్తున్నాడు.
యూఎస్ ఓపెన్ స్టాండ్స్ లో ధోనీ:
ఇక ఇటివలి మహేంద్ర సింగ్ ధోని US ఓపెన్‌లో స్టాండ్స్‌లో కనిపించాడు. టెన్నిస్ టోర్నమెంట్‌కు స్టార్ పవర్ టచ్ జోడించాడు. వర్ధమాన టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) , అలెగ్జాండర్ జ్వెరెవ్ (Alexendar Zverev) మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించిన ధోనిని అక్కడి ప్రజలు ఆనందపడ్డారు. ధోని హాజరు కావాడాన్ని బ్రాడ్‌కాస్టర్లు హైలైట్ చేశారు. టెన్నిస్‌పై ధోనీకి చాలా ఆసక్తి. వింబుల్డెన్ మ్యాచ్‌లకు సైతం హాజరవుతుంటాడు ఈ కెప్టెన్ కూల్. ఇక ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. క్రీజులో ఉన్నాడంటే ఇండియా ఓడిపోయే మ్యాచ్ అయినా విజయం సాధించాల్సిందే. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి ప్రత్యర్థుల ఆశలను సిక్సర్లతో చెరిపేయడం ధోనీ స్టైల్. ఇలా ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. 1983 తర్వాత 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ తెచ్చిపెట్టాడు. అటు వికెట్ల వెనుక ఎంఎస్ ధోని చురుకుదనం ఎవరికీ కనిపించదు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా టీమిండియాకు ధోనీ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. కీపింగ్ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ కీపర్లలో ధోనీ ఒకరు. 538 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ధోని 195 స్టంపింగ్‌లు చేశాడు. అందుకే ధోనీకి బెస్ట్ వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
ALSO READ: ధోనీలో ఆ టాలెంట్ గుర్తించింది ఎవరో తెలుసా? మహేంద్రుడి సక్సెస్‌కి కారణం ఆయనే!