ధోని పేరు చెప్పి..పాపను ఎత్తుకుపోయారు!

క్రికెటర్‌ ధోనీ పేద వారికి డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్‌ లోని రాంచీలో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం నగరంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!
New Update

Kidnap in Ranchi: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni) పేరు చెప్పి ఓ మహిళను మాయ చేయడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన ఝార్ఖండ్‌ (Jharkhand) లోని రాంచీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... క్రికెటర్‌ ధోనీ పేద వారికి డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని బాధిత మహిళను నమ్మించి దుండగులు ఈ దురాగాతానికి పాల్పడ్డారు.

మూడు రోజుల క్రితం నగరంలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధుదేవి (Madhudevi) అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రాంచీలో షాపింగ్‌ చేస్తుండగా ఆమె వద్దకు బండి మీద ఓ యువకుడు, యువతి వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించారు.

Also read: ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రవితేజ.. షూటింగ్ ప్రారంభం!

అలా మాట్లాడుతూ..క్రికెటర్‌ ధోనీ పేదవారికి సాయం చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని ఆమెను నమ్మించారు. ఆ మాటలు నిజం అని నమ్మిన మధు.. తనని కూడా అక్కడికి తీసుకుని వెళ్లమని అడిగింది. దీంతో వారి వెంట మధు తో పాటు ఆమె చిన్న కుమార్తెను బండి మీద తీసుకుని వెళ్లారు.

మధు పెద్ద కూతుర్ని అక్కడే ఉన్న ఓ ఫుడ్‌ స్టాల్‌ వద్ద ఉంచి వెళ్లారు. మధును వారు హర్ములోని ఓ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్దకు తీసుకుని వెళ్లి, లోపల సమావేశం జరుగుతుందని ఆమెకి చెప్పి లోపలికి వెళ్లమన్నారు. ఈ క్రమంలో ఆమె లోపలికి వెళ్లగా బండి మీద ఉన్న చిన్న పాపను తీసుకుని వారిద్దరూ పారిపోయారు.

పాపను ఎత్తుకుపోతున్నారన్న విషయాన్ని గమనించిన మధు వెంటనే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు దొరకలేదు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పాప తల్లి చెబుతున్న విషయాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ప్రభుత్వ పథకం అని చెప్పిన ఆమె ఆ తర్వాత ధోనీ పేరు చెప్పిందని పేర్కొన్నారు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు.

#jharkhand #dhoni #kidnap-in-ranchi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe