Mr.Bachchan : ఆ ఓటీటీలో రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ అప్పుడే?

రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

New Update
Mr.Bachchan : ఆ ఓటీటీలో రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ అప్పుడే?

Mr.Bachchan Movie : మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్' సినిమా నేడు (ఆగస్టు 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనేది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మిస్టర్ బచ్చన్ ఓటీటీ వివరాలు బయటికొచ్చాయి.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే?

మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్

తాజా సమాచారం ప్రకారం, 'మిస్టర్ బచ్చన్' సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే అధికారిక వివరాలు ఇంకా వెల్లడించలేదు. రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్‌గా కనిపించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు