Mr.Bachchan : నెలలోపే ఓటీటీలోకి 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?

రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6 లేదా 7న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

New Update
Mr.Bachchan : నెలలోపే ఓటీటీలోకి 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?

Mr.Bachchan Movie : మాస్ మహారాజు రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు.

కానీ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ ను సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి. అవుడ్ డేటెడ్ కంటెంట్ తీసుకోని దానికి కమర్షియల్ హంగులు అంటూ హరీష్ చేసిన ప్రయోగగం బెడిసి కొట్టడంతో సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇలాంటి తరుణంలో ఈ మూవీ అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.

Also Read : ప్రభాస్ – అర్షద్ వివాదంపై మంచు విష్ణు రియాక్షన్.. డైరెక్ట్ బాలీవుడ్ కే లేఖ రాస్తూ వార్నింగ్

'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ రిజల్ట్ తేడా కొట్టడంతో నెలలోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.దాని ప్రకారం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 6 లేదా 7న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Advertisment
తాజా కథనాలు