అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి.!

విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. "అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి.. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం" అంటూ ఘాటుగా స్పందించారు.

New Update
అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి.!

Ayyanna Patrudu: ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, టీడీపీపై విమర్శలు గుప్పిస్తూ విజయసాయిరెడ్డి ఈ విధంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. "ప్రియాంక వాద్రా ర్యాలీల్లో టీడీపీ వాళ్ళు జెండాలు పట్టుకుని పాల్గొనడానికి సిగ్గుండాలి.. చంద్రబాబు గారి, పురంధేశ్వరి గారి విలువలు లేని రాజకీయాలకిది నిదర్శనం. బీజేపీలో ఉంటూ టీడీపీ బాకా ఊదుతున్న పురంధేశ్వరి గారు తమ బావ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కట్టడంపై ఏమంటారో మరి!" అంటూ ధ్వజమెత్తారు.

Also read: నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!

అయితే, ట్విట్టర్లో విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు." అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి. టిడిపి తెలంగాణలో పోటీ చెయ్యడం లేదు అని ప్రకటించింది. టిడిపి సానుభూతిపరుల ఓట్లు కావాలి అనుకున్న అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ కండువా కప్పుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం. మీలా అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు మా సిద్దాంతం కాదు."  అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఈ  ట్విట్టర్ వార్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు