AP: 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభిస్తాం: కేంద్రమంత్రి

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టును 2026 జూన్ లోపు ప్రారంభిస్తామన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే 36 శాతం పనులు పూర్తయినట్టు చెప్పారు. తెలంగాణలో కూడా కొత్త ఎయిర్‌పోర్టును నిర్మిస్తామన్నారు.

AP: 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభిస్తాం: కేంద్రమంత్రి
New Update

MP Kinjarapu Ram Mohan Naidu: విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయ పనులను కేంద్ర విమానయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 2026 జూన్ లోపు విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టు తీసుకున్నామన్నారు. ప్రతినెల ఈ ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేస్తామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Also Read: రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం

రానున్న రోజుల్లో ఈ ప్రాంత రూపురేఖలు మార్చే గల శక్తి ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. ఇప్పటికే 36.3 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. దేశం లోని ఉన్న విమానాశ్రయాలు అన్నీ వేగంగా నిర్మిస్తున్నామని.. త్వరలో శ్రీకాకుళంకు ఎయిర్ పోర్ట్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఊరవకల్లు, దత్తిగిరి, నాగార్జునసాగర్, కుప్పంలో విమానాశ్రయాలను నిర్మిస్తామన్నారు.

Also Read: రోడ్డు ప్రమాదం కాదు.. కావాలనే నేనే ఇలా చేశా.. దివ్వల మాధురి సంచలన వ్యాఖ్యలు..

ఉదాన్ స్కీమ్ వల్ల మన దేశ విమానయాన శాఖ ప్రపంచంలోనే ఉన్నతంగా తయారైందని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు. తెలంగాణలో కూడా కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను త్వరలోనే పూర్తి చేయనున్నామని అన్నారు.

#kinjarapu-ram-mohan-naidu #bhogapuram-airport
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe