MP Kesineni Nani: బోండా ఉమాకి జగన్ పై దాడి గురించి తెలుసు..కేశినాని సంచలన వ్యాఖ్యలు..!

బొండా ఉమా కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని. అతడి ఇద్దరు కుమారులు కూడా రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బోండా ఉమాకి సీఎం జగన్ పై దాడి చేయించిన విషయం తెలుసన్నారు.

New Update
Kesineni Nani: మోదీ రోడ్ షో అట్టర్ ప్లాప్.. అలా అనుకోవడం కలే..!

MP Kesineni Nani: టీడీపీ నేత బొండా ఉమాపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమా కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు అని హాట్ కామెంట్స్ చేశారు. అతడి తోపాటు అతని ఇద్దరు కుమారులు కూడా రౌడీయిజం, గుండాయిజానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బోండా ఉమ బుడమేరును ఆక్రమించి భూకబ్జాలు చేశాడని ఆరోపించారు.

సీఎం జగన్ తలకు, వెలంపల్లి శ్రీనివాస్ కన్నుకు దాడికి పాల్పడటం దారుణమన్నారు. బోండా ఉమాకి దాడి చేయించిన విషయం తెలుసన్నారు. చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు బోండా ఉమా అన్నారు. నిన్న బోండా ఉమ.. మా వాళ్లే కొట్టారు.. అన్న క్యాంటీన్ తీసినందుకనీ అనలేదా..? అని ప్రశ్నించారు. బోండా ఉమా రెండు రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చాడని.. బోండా ఉమా దాడి చేసామని స్పష్టంగా చెప్పాడన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడని విమర్శలు గుప్పించారు.

Also Read: ముద్రగడ ఒక పెద్ద దరిద్రం.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలని కూల్చి వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని..సీఎం జగన్ పై దాడిపట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్ పై దాడి చేసింది ఎవరో..? నని అన్నారు. బోండా ఉమకి బుద్ధి జ్ఞానం లేదు..ఎవరైనా కంటిమీద దాడి చేయించుకుంటారా..? అని నిలదీశారు.

బోండా ఉమా ఓడిపోతారని తెలుసన్నారు. భూ కబ్జాలు, రౌడీయిజం చేస్తారని ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అయిందని బోండా ఉమ సునకానందం పొందాడన్నారు. పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమ ఎందుకు పారిపోతున్నాడని ప్రశ్నించారు. తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలోని చేతులన్నీ బొండా ఉమా వైపే చూపెడుతున్నాయని..బొండా ఉమా తప్పు చేశాడు కాబట్టే మారువేషంలో తిరుగుతున్నాడన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు