Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ..! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. By Jyoshna Sappogula 24 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MP Bandi Sanjay Letter to CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. Also Read: రిపబ్లిక్ డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం..థీమ్ మాములుగా లేదుగా..! రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని విమర్శలు గుప్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి! గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని లేఖలో రాశారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సర్పంచులతో సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలని లేఖలో కోరారు. #telangana-cm-revanth-reddy #bjp-mp-bandi-sanjay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి