/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ycp-mp-2-jpg.webp)
MP Balasouri: ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజీనామా పర్వం కొనసాగుతోంది. అధిష్టానం సిట్టింగులను మార్చడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పట్టికే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైసీపీ ముఖ్య నేతలు రాజీనామ చేశారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రిసెంట్ గా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కూడా వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఇప్పుడు అదే బాటలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నడుస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: జగన్ షాక్.. రాజీనామా బాటలో వైసీపీ ఎంపీ?
జనసేనలో చేరిక?
వైసీపీని వీడి జనసేనలోకి చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో జగన్ ఉన్న ఫొటో కాకుండా.. కేవలం రాజశేఖర్ రెడ్డి ఫొటోలతో సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన రాజకీయ నాయకులు ఎంపీ బాలశౌరికి జనసేనలో చేరిక ఖరారు అయినట్టేనని టాక్ వినిపిస్తుందంటున్నారు.
యువతకు స్ఫూర్తి ప్రదాత దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తి చేసిన చైతన్య మూర్తి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు….
.
.#Machilipatnam#SwamiVivekanandaJayanti #swamiviveknandajayanti#AndhraPradesh#VallabhaneniBalashowry pic.twitter.com/c6tN2pIw2e— Vallabhaneni Balashowry (@VBalashowry) January 12, 2024
Also Read: ‘కేశినేని కౌన్ కిస్కా గొట్టం, క్యారెక్టర్ లెస్, ఊసరవెల్లి’ ఇందుకోసమే నానికి టిక్కెట్ ఇచ్చారు..
కారణం ఇదేనా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం సీఎం జగన్ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి సీఎం జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. ఇందుకే, జనసేనలోకి వెళ్లాలని ఎంపీ బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు సీటు కావాలని బాలశౌరి జనసేన అధినేత పవన్ ను కోరారట.