MP Balashowry : జనసేన అధినేత పవన్‌తో (Pawan Kalyan) ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవలే బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన త్వరలోనే జనసేన పార్టీలో (Janasena Party) చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 21న ఆయన జనసేన గూటికి చేరుతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాజాగా, ఆయన హైదరాబాద్‌లో పవన్‌తో చర్చలు జరిపారు. బందరు ఎంపీ సీటు లేదా గుంటూరు ఎంపీ సీటు బాలశౌరి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కూడా కచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలశౌరి రాకతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీ అధికార పార్టీ వైసీపీ సిట్టింగులను మార్చడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంపీ బాలశౌరి ఆ పార్టీకి రాజీనామ చేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని బాలశౌరి (Balashowry Vallabbhaneni) గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీని వీడడానికి కారణమని తెలుస్తోంది.
Also Read: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.!
దీనికి తోడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం సీఎం జగన్ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి సీఎం జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. ఇందుకే, జనసేనలోకి వెళ్లాలని ఎంపీ బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.