పుట్టబోయే బిడ్డ కోసం, సాహసం చేయనున్న మెగాస్టార్ కోడలు ఉపాసన.... By Shareef Pasha 14 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య, మెగా కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని సొంతం చేసుకుంది. అపోలో లైఫ్ కు వైస్ చైర్ పర్సన్ గా ఎన్నో ఏళ్లగా సేవలు అందిస్తూ వస్తున్న ఉపాసన 2012 లో రామ్ చరణ్ ను వివాహం చేసుకుంది.అయితే ఉపాసన త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెన్సీ అవడంతో ఆక్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎదురుచూస్తున్నారు. ఉపాసన సైతం తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బేబీ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించింది. అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే.. బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు వస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. అయితే.. గతంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి