జర్నీలో పరిచయమైన వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి షాక్ ఇచ్చిన బాలయ్య....

New Update

సాధారణంగా ఏ స్టార్ హీరో అయిన సరే.. తమకు అత్యంత సన్నిహితులయిన స్నేహితుల యొక్క ఇంట్లో కొన్ని వేడుకలకు మాత్రమే హాజరు అవుతారు. ఎందుకంటే సినిమాలతో నిత్యం ఎంతో బిజీగా ఉండేవారు గంట సమయం కేటాయించాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కేవలం ముఖ్యమైన సన్నిహితుల కోసం మాత్రమే తమ సమయాన్ని కేటాయిస్తారు. అలాంటిది బాలయ్య తనతో విమానంలో ట్రావెల్ చేసిన వ్యక్తి తనని ఆహ్వానించగా.. తన ఆహ్వానం మేరకు తానే స్వయంగా వెళ్లి గృహప్రవేశం కార్యక్రమానికి హాజరై వారి కుటుంబసభ్యులతో పాల్గొని అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇంతకీ అదెక్కడ... ఆ విశేషాలేంటో తెలియాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.....

movienewsbalayya-surprises-finds-a-friend-on-flight

ఓసారి.. నటసింహం నందమూరి బాలకృష్ణ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్కన కూర్చున వ్యక్తితో అతడికి పరిచయం ఏర్పడి., ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందట. సాధారణంగా సెలబ్రెటీలు ఇవన్నీ పట్టించుకోరు. ట్రావెల్‌ సమయంలో కనీసం పక్క వారితో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించరు. అలాంటిది కేవలం గంట సమయం ప్రయాణం చేసిన సమయంలో పక్కన కూర్చున్న వ్యక్తితో బాలయ్యకు స్నేహం ఏర్పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.ప్రయాణ సమయంలో పరిచయం అయిన వ్యక్తితో బాలకృష్ణ స్నేహం కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. అయితే.. తాజాగా ఆ స్నేహితుడు యొక్క గృహ ప్రవేశం కార్యక్రమానికి నందమూరి బాలయ్య హాజరు అయ్యాడు. తన ట్రావెల్ ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ బాలయ్య అక్కడ సందడి చేయడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే అఖండ..వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మంచి ఫాంలోకి వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బాలయ్య నటించిన చిత్రం 'భగవంత్ కేసరి' ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్టర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాను బాలయ్య చేయబోతున్నారు. ఆ తర్వాత వరుసగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను బాలయ్య చేయబోతున్నారు. ఇక.. ఈ మూవీస్‌ కోసం ఫ్యాన్స్‌ తెగ వెయిట్ చేస్తున్నారు. ఇక.. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుండటంతో ఇక ఫ్యాన్‌కి పూనకాలనే చెప్పాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe