ఆ హీరో.. నన్ను లైంగికంగా వేధించాడు.. నిత్యామీనన్ By Shareef Pasha 15 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి నేచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో.. టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చి తన నటనతో ఆడియెన్స్‌కు మెప్పించిన హీరోయిన్ నిత్యా మీనన్. ఇక.. ఆ తర్వాత తన ప్రతిభతో వరుసగా తెలుగులో మంచి అవకాశాలను దక్కించుకుంది.. తనకు నటనతో పాటు, తనలో మరో టాలెంట్ కూడా ఉంది అదే సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది నిత్యా మీనన్. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో, పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించి ఆకట్టుకుంది. నిత్యామీనన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో జడ్జ్ గా కూడా ఆమె వ్యవహరించింది. అయితే, తాజాగా నిత్యామీనన్ క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ లు, మీడియా ముందుకు వచ్చి, పలు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురైనా చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. తాజాగా నిత్యామీనన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. నిత్య క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..మహిళలను లైంగికంగా వేదించేవారు అన్నిరంగాల్లో వుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఓ షూటింగ్ సమయంలో, చాలా ఇబ్బందులను ఎదురుకున్నాను. ఓ హీరో నన్ను బాగా వేధించాడు అని ఈ భామ చెప్పుకొచ్చింది. నన్ను ఎక్కడపడితే అక్కడ తాకుతూ, చాలా నీచంగా ప్రవర్తించాడు అని కూడా తన ఆవేదనను తెలిపింది. నిత్య చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి