ఆ కండిషన్స్‌కి ఓకే అంటేనే.. లావణ్య కండీషన్స్‌కి షాకైన నాగబాబు By Shareef Pasha 14 Jun 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి నాగబాబు నివాసమైన హైదరాబాద్ మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ నెల 9న వరుణ్, లావణ్యల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ జంటపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. లావణ్య సినిమాలు చేయకూడదని వరుణ్ కండిషన్‌లు పెట్టినట్లు టాక్. అలాగే లావణ్య త్రిపాఠి కూడా వరుణ్‌కి ఓ కండీషన్ పెట్టిందట. తనకిష్టమైన క్లాసికల్ డ్యాన్సు ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పొద్దని, అలాగే సినిమా ప్రొడక్షన్‌లో తాను కొనసాగుతాననే కండీషన్ పెట్టినట్టు సమాచారం. ఈ ఒప్పందంపై వీరిద్దరూ ఒక్కటైనట్లు వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు ఏవీ నిజం కాదని.. అవన్నీ ఉత్త మాటలే అంటూ మరో వార్త సైతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. తాజాగా లావణ్య త్రిపాఠి ఒకేసారి మూడు ప్రాజెక్ట్‌లను ఒప్పుకుందట. మెగా కోడలు చేయబోతున్న మూడు సినిమాల వివరాలను ప్రకటించింది పీఆర్ టీమ్. ఇందులో తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తుంది. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తుందట. దీంతో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓ వెబ్ సిరీస్‌లోనూ లావణ్య నటిస్తుందట. ఈ మూడు ప్రాజెక్టులు లావణ్య కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యామిలీ పెట్టిన కండిషన్లు ఉత్త మాటలే అని కొందరూ అంటుంటే.. లావణ్య మెగా ఫ్యామిలీ కండిషన్స్‌ను పట్టించుకోవడం లేదా అంటూ మరుకొందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టులపై పూర్తి క్లారిటీ రావాలంటే మెగా ఫ్యామిలీ కొత్త కోడలు లావణ్య త్రిపాఠి డైరెక్ట్‌గా స్పందించే వరకు వీటన్నింటికి పుల్‌స్టాప్ పడేలా లేదు మరి ఆమె ఎప్పుడు స్పందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి