MAA: ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా చూపిస్తాం: ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించిన 'మా'!

సినీ నటులపై అసభ్య, అసత్య ప్రచారాలు చేస్తున్న ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ రద్దు చేయించింది. 'అణచివేత మొదలైంది. 5 ఛానళ్లు మూతపడ్డాయి. మరో జాబితా సిద్ధం చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్‌లో కఠిన చర్యలు కొనసాగుతాయి' అంటూ పోస్ట్ పెట్టింది.

New Update
MAA: ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా చూపిస్తాం: ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను రద్దు చేయించిన 'మా'!

MAA Telugu: నటీనటులు, వారి కుటుంబాలపై అసభ్యకరమైన పోస్టులు, ట్రోలింగ్, ఇతరత్ర అసత్యప్రచారాలు చేస్తున్న ఐదు యూట్యూబ్‌ ఛానళ్లను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ రద్దు చేయించినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరోసారి హెచ్చిరిస్తూ పోస్ట్ పెట్టారు మా నిర్వాహకులు. 'అణచివేత మొదలైంది. నటీనటులు, వారి కుటుంబాలు, వ్యక్తిగత విషయాలపై అవమానకరమైన పోస్ట్ లు పెట్టినందుకు ఐదు యూట్యూబ్ ఛానెల్‌లు రద్దు చేయబడ్డాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేము తదుపరి చర్య తీసుకునేందుకు మరో జాబితాను సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయి' అంటూ రాసుకొచ్చారు.

48 గంటలు మాత్రమే సమయం..
ఇక ఇటీవలే హీరోహీరోయిన్లపై క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్, మీమ్స్, కంటెంట్ ను 48గంటల్లో తొలగించాలంటూ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఓ తండ్రి-కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమన్నారు. ‘ట్రోలింగ్ వీడియోలు చేసే వారికి, అసభ్యకరమైన వీడియోలు చేసే వారికి ఒక 48 గంటలు మాత్రమే సమయం ఇస్తున్నా. దయచేసి అలాంటి వీడియోలన్నీ తక్షణమే తొలగించండి. ఒకవేళ మీరు తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తాం.అలాగే మీ యూట్యూబ్‌ ఛానళ్లు బ్యాన్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా, డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా’ అని వివరించారు.

Also Read: ఓటీటీలో ‘మీర్జాపూర్ 3’ హవా.. అత్యధిక వ్యూస్ తో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు