Breast Milk: ప్రసవం తర్వాత స్త్రీల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పుడతాయి. దీంతో బిడ్డకు పాలివ్వడంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యను అధిక మించడంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. బిడ్డకు తగినంత పాలు ఇవ్వకపోతే తల్లి ఆరోగ్యానికి మంచిది కాదు. డెలివరీ తర్వాత సరిపడ పాలు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మహిళలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ:
- డెలివరీ తర్వాత బిడ్డకు పాలివ్వడంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతారు. చాలామంది స్త్రీలకు పాలు అందవు. దీని కారణంగా బిడ్డ, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది.
- ప్రసవం తర్వాత తల్లులకు పాలు లేకపోవాటానికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడం. దీనివల్ల బిడ్డకు తల్లిపాలు ఇచ్చే సమయంలో సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
- స్త్రీ శరీరం లోపలి నుంచి బలహీనంగా ఉన్నప్పటికీ పాలు స్ఖలనం చేయడానికి సమయం పడుతుంది. తల్లికి చాలా తక్కువ పాలు ఉన్నందున ఆమె కడుపు నింపుకోలేకపోతుంది. అటువంటి టైంలో మహిళలు ఆహారంలో పోషకాహారం, ప్రొటీన్లను ఎక్కువగా చేర్చుకోవాలి. దీంతో పాలు అధికం వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తల్లిపాల వల్ల శిశువు ప్రయోజనాలు:
- శిశువులకు తల్లిపాలు ప్రకృతి పరిపూర్ణ ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఇది శిశువు సులభంగా జీర్ణమై సరైన పెరుగుదల,అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి.
- తల్లిపాలలో ఉంటే యాంటీబాడీస్, ఎంజైమ్‌లు శిశువు రోగనిరోధకశక్తిని బలపరుస్తాయి. చెవి ఇన్‌ఫెక్షన్‌లు, తామర, అలెర్జీలు, అనారోగ్యాలతో సహా అనేక రకాల ఇన్‌ఫెక్షన్‌లకు రక్షణ కవచంగా పనిచేస్తుంది.
- శివువు తల్లిపాలు తాగటం వల్ల భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: యువత గుండె పోటుకు కారణం ఇదే.. వెలుగులోకి సంచలన విషయాలు!