కూతురిని గొంతు నులిమి హత్య చేసింది..తర్వాత తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!

ఓ కన్న తల్లి తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. కూతురు మేరిజెస్సీ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో బిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.

New Update
కూతురిని గొంతు నులిమి హత్య చేసింది..తర్వాత తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. ప్రసాదంపాడులో తగరం జ్యోతి(35) అనే మహిళ కన్న కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. జ్యోతికి మేరిజెస్సీ(3)ఏళ్ల కుమార్తె ఉంది. అయితే, మేరి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. కూతురు అనారోగ్యాన్ని తలచుకుని తల్లి జ్యోతిరాణి తీవ్ర మనోవేదనకు గురైంది.

రోగం బారినపడిన కుమార్తె తల్లడిల్లిపోతుండటంతో ఆ తల్లి గుండె పగిలిపోయింది. కుమార్తెను బాగు చేసుకునే స్థోమత లేక జ్యోతిరాణి దారుణమైన నిర్ణయం తీసుకుంది. కూతురు మేరీ జేస్సీ కూతురిని గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం జ్యోతిరాణి కూడా గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి తల్లీకూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పడమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నవ మాసాలు మోసింది. కూతురు పుట్టడంతో ఆ తల్లి తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని సంబరపడింది. అయితే కుమార్తెకు పుట్టినప్పటి నుంచి అనారోగ్యం బారినపడటంతో ఆ తల్లి గుండో పగిలిపోయింది. తాను జన్మనిచ్చిన కూతురు జీవితం రోజు రోజుకు మరణం అంచుకు దగ్గర అవుతుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. మూడేళ్ల ప్రాయంలో తన కుమార్తెపడుతున్న బాధను తట్టుకోలేకపోయింది. దీంతో కుమార్తెను చంపి అనంతరం తల్లి కూడ ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read: కంద దుంప నుండి అరటి గెల..ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు