Vacation : భారతదేశంలోని అందమైన గ్రామాలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..! భారతదేశంలోని అందమైన నగరాలను చాలాసార్లు అన్వేషించి ఉంటారు. కానీ భారతదేశంలోని ఈ అందమైన గ్రామాలకు ఎప్పుడైనా వెళ్ళారా ..? ఇవి గొప్ప అనుభూతితో పాటు మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. మనా గ్రామం, ఖిమ్సార్, కుట్టనాడ్, డార్చిక్, మలానా. By Archana 05 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి India : భారతదేశంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి, అయినప్పటికీ, చాలా మంది ప్రజలు గోవా, సిమ్లా, మనాలి వంటి ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ప్రతీ సారి ఇలాంటి నగరపాలిత పర్యాటక ప్రదేశాలను అన్వేషించే వారు.. ఈ సారి కొత్తగా గ్రామాలను ఎక్స్ ప్లోర్ చేయండి. భారతదేశంలోని ఈ అందమైన, అద్భుతమైన గ్రామాలను జీవితంలో ఒక్క సారైన సందర్శించుకోండి. ఇవి గొప్ప అనుభూతితో పాటు మనసుకు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి. ఆ గ్రామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.. భారతదేశంలోని ప్రసిద్ధ గ్రామాలు మనా గ్రామం భారతదేశం(India) లోని ప్రసిద్ధ గ్రామాల గురించి ప్రస్తావించినప్పుడు ఈ గ్రామం పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది. అదే ఇండియా, టిబెట్-చైనా సరిహద్దుల్లోని ఆఖరి గ్రామం 'మనా గ్రామం'. ద్రీనాథ్ సమీపంలోని ఈ గ్రామం ఉత్తమ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ గ్రామం చుట్టూ హిమాలయ కొండలు ఉంటాయి. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన వాతావరణం మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఖిమ్సార్ గ్రామం రాజస్థాన్‌లోని థార్ ఎడారి ఒడ్డున ఉన్న ఈ గ్రామం మధ్యలో నీటి సరస్సు ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ ఇసుక మాత్రమే కలిగి.. అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ నాగౌర్ మహోత్సవ్ నిర్వహిస్తారు. దీన్ని చూసేందుకు ఎంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు(Tourists) వస్తుంటారు. కుట్టనాడ్ గ్రామం కుట్టనాడ్ గ్రామం అలప్పుజా జిల్లాలోని బ్యాక్ వాటర్స్ మధ్యలో ఉంది. వరి పంట ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి 'రైస్ బౌల్' అని పేరు కూడా పెట్టారు. ప్రపంచంలో సముద్ర మట్టానికి 2 మీటర్ల లోతులో వ్యవసాయం చేసే ఏకైక ప్రదేశం ఇదే అని నమ్ముతారు. డార్చిక్ గ్రామం ఈ గ్రామం లడఖ్‌లోని కార్గిల్ జిల్లాలోని కార్గిల్ తహసీల్‌లో ఉంది. ఇది కార్గిల్ తహసీల్ చెందిన 66 అధికారిక గ్రామాలలో ఒకటి. ఇక్కడి అందమైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి, వీక్షణలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. డార్చిక్ చేరుకోవడానికి లేహ్ నగరానికి పశ్చిమాన డ్రైవ్ చేసి ఆర్యన్ వ్యాలీ గ్రామాలకు చేరుకోవచ్చు. మలానా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) లోని మలానా భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలలో ఒకటి. ఈ గ్రామంలో అనేక గిరిజనులు నివసిస్తారు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశం ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రెక్కింగ్ కోసం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. Also Read: Life Style: గర్భధారణకు సరైన వయస్సు ఏది? లేట్ ప్రెగ్నెన్సీ ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..? #tourist-place #vacation #popular-villages-in-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి