మొరాకోలోని హైఅట్లాస్ పర్వతాలలో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన శక్తివంతమైన భూకంపానికి దాదాపు 632 మంది చనిపోయారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన నగరాల నివాసితులు వారి ఇళ్ల నుంచి పరుగెత్తినట్లు అక్కడి మీడియా చెబుతోంది. గాయపడిన వారి సంఖ్య ఎంతన్నది ఇప్పటివరకు అధికారికంగా స్పష్టంగా కాలేదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన పాత నగరంలో కొన్ని భవనాలు కూలిపోయాయని భూకంప కేంద్రానికి సమీపంలోని పెద్ద నగరమైన మర్రకేచ్ నివాసితులు తెలిపారు.
ఆఫ్రికా దేశంలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య ఇప్పటికే 600దాటగా.. ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం ఉత్తర ఆఫ్రికా దేశంలోని ఆ భాగాన్ని తాకిన బలమైన ప్రకంపన అని పేర్కొంది. రాత్రి 11:11 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మర్రకేష్‌కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. తీరప్రాంత నగరాలైన రబాత్, కాసాబ్లాంకా మరియు ఎస్సౌయిరాలో కూడా భూకంపం సంభవించింది. మొరాకోలో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఆఫ్రికన్ - యురేషియన్ ప్లేట్ల మధ్య ఈ దేశం ఉన్న ప్లేస్ కారణంగా దాని ఉత్తర ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1960లో, మొరాకో నగరమైన అగాదిర్ సమీపంలో 5.8 తీవ్రతతో ప్రకంపనలు సంభవించి వేలాది మంది మరణించారు. 2004లో, మధ్యధరా తీర నగరమైన అల్ హోసీమా సమీపంలో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 600 మందికి పైగా మరణించారు. ఈ భూకంప ప్రతిధ్వనులు మొరాకో సరిహద్దులను దాటి పోర్చుగల్, అల్జీరియా వరకు వచ్చాయి. పోర్చుగీస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సీ అండ్ అట్మాస్పియర్ అండ్ అల్జీరియా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ భూకంపం ప్రభావాన్ని ధృవీకరించాయి.
ALSO READ: మొరాకో భారీ భూకంపం. 300 దాటిన మృతుల సంఖ్య!