Deep fake: భారతీయులు 70% పైగా డీప్‌ఫేక్‌కు గురవుతున్నారు.. మెకాఫీ సంచలన రిపోర్ట్! 70 శాతానికి పైగా భారతీయులు డీప్ ఫేక్ లకు గురువుతున్నట్లు కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ (McAfee) తాజా సర్వేలో బయటపెట్టింది. ఇందులో 57 శాతం రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలున్నట్లు తెలిపింది. సగటున 10లో 8 మంది డీప్‌ఫేక్‌ల గురించి ఆందోళన చెందుతున్నారని డేటాలో పేర్కొంది. By srinivas 26 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి McAfee Survey On Deepfake: కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ (McAfee) తాజా సర్వేలో సంచలన విషయాలు బయటపెట్టింది. 70 శాతానికి పైగా భారతీయులు డీప్ ఫేక్ లకు గురువుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు 75 శాతం మంది డీప్‌ఫేక్ కంటెంట్‌ను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. తాజాగా 22 శాతం మంది రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్, వీడియో, ఫొటోలు డిజిటల్‌గా మార్చబడినట్లు తాము స్వయంగా గుర్తించినట్లు తెలిపింది. పరిచయమున్న వ్యక్తులే మోసాలకు పాల్పడుతూ.. ఈ మేరకు కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతల ఆధారంగా సోషల్ మీడియా, మొబైల్ వినియోగదారుల రోజువారీ జీవితంలో డీప్‌ఫేక్‌ల పెరుగుదలను తెలుసుకోవడానికి 2024 ప్రారంభంలో పరిశోధన మొదలుపెట్టినట్లు మెకాఫీ తెలిపింది. ఇందులో భాగంగానే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు, మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి కార్యక్రమాలతో డీప్‌ఫేక్‌లకు గురయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తెలిపింది. చాలా మంది భారతీయులు తమకు సంబంధించిన అసలైన, ఫెక్.. ఫొటో, వీడియో, వాయిస్ లను అర్థం చేసుకోలేకపోతున్నారని పలు ఆధారాలు సేకరించింది. ఈ సర్వేలో దాదాపు సగటున 4శాతం మంది భారతీయులల్లో 1శాతం మంది తమకు తెలిసిన వారి నకిలీ వీడియోలు కనిపించాయని కనుగొన్నట్లు మెకాపీ బృందం పేర్కొంది. ఇది కూడా చదవండి: Gun Park: హరీష్ రావు హంతకుడు.. వాళ్ల చావుకి అతనే కారణం: బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు! 75 శాతం మంది ప్రజల డీప్‌ఫేక్.. అలాగే 10లో 8 మంది డీప్‌ఫేక్‌ల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని డేటా వెల్లడించింది. ఆన్‌లైన్ స్కామ్‌లను గుర్తించడం AI కష్టతరం చేసిందని చెప్పారు. ఇక గత 12 నెలల్లో 75 శాతం మంది ప్రజల డీప్‌ఫేక్ కంటెంట్‌ను తాము చూశామని, అందులో 38 శాతం మంది వ్యక్తులు డీప్‌ఫేక్ స్కామ్‌ను ఎదుర్కొగా18 శాతం మంది డీప్‌ఫేక్ స్కామ్‌కు ప్రత్యక్షంగా గురయ్యారని తెలిపింది. 57 శాతం మంది సెలబ్రిటీలే.. డీప్‌ఫేక్ మోసాన్ని ఎదుర్కొన్న లేదా బాధితులైన వారిలో 57 శాతం మంది సెలబ్రిటీలే కేసులు నమోదు చేశారు. ఇలాంటి స్కామ్ ఫలితంగా 31 శాతం మంది తమ డబ్బును కోల్పోయారు. 40 శాతం మంది తమ వాయిస్ క్లోన్ చేయబడిందని, వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును బహిర్గతం చేయడానికి తమకు తెలిసిన వారిని తప్పుదారి పట్టించడానికి ఉపయోగించారని సర్వేలో వెల్లడించారు. అయితే 39 శాతం మంది కాల్, వాయిస్ మెయిల్ లేదా వాయిస్ నోట్‌ను స్వీకరించినట్లు తెలిపారు. స్నేహితుడు లేదా ప్రియమైన వ్యక్తిలా వాయిస్ మార్చి మోసం చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారని మెకాఫీ వెల్లడించింది. ఇందులో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అమీర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌లకు సంబంధించిన డీప్ ఫేక్స్ కూడా ఉన్నట్లు వివరించింది. #indians #deep-fake #mcafee-survey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి