Mega Job Mela: వందకు పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..నల్లగొండలో మెగా జాబ్ మేళా..!! నల్లగొండలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన వెల్లడించారు.ఫిబ్రవరి 26వ తేదీన 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. By Bhoomi 20 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Mega Job Mela: నల్లగొండలోని నిరుద్యోగులకు శుభవార్త. నల్లగొండ జిల్లాలో ఫిబ్రవరి 26న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన వెల్లడించారు. 100కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదిన ఉదయం 9 గంటలకు.. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ యువతకు పిలుపునిచ్చారు. pic.twitter.com/Q8QEtzvgHv — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 19, 2024 తెలంగాణ ఫెసిలిటి మేనేజ్ మెంట్ కౌన్సెల్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్ మెంట్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్ఎస్ సీ , ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హత సంబంధించిన డాక్యుమెంట్స్ ను తీసుకుని రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రిక్వెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త…రేపు విజయవాడలో మెగా జాబ్ మేళా..పూర్తి వివరాలివే..!! #nalgonda #mega-job-mela మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి