Nayanthara : మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార.. 'అమ్మోరు తల్లి' సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్!

నయనతార లీడ్ రోల్ లో 2020 లాక్‌డౌన్ టైంలో 'మూకుత్తి అమ్మన్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో అల‌రించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

New Update
Nayanthara : మరోసారి అమ్మవారి పాత్రలో నయనతార.. 'అమ్మోరు తల్లి' సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్!

Mookuthi Amman 2 Official Announcement Video : కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. గత ఏడాది షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తమిళ్ తో పటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక తాజాగా నయన్ నుంచి మరో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. నయనతార లీడ్ రోల్ లో 2020 లాక్‌డౌన్ టైంలో 'మూకుత్తి అమ్మన్' అనే సినిమా వచ్చింది.

కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. కామెడీ అండ్ డివోష‌న‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించి ప్రేక్ష‌కుల‌కు అల‌రించింది. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వహించారు. తెలుగులో 'అమ్మారు తల్లి' పేరుతో విడుదలై ఇక్కడి ఆడియన్స్ ను సైతం ఆకట్టుకుంది.

Also Read : ‘డబుల్ ఇస్మార్ట్’ సెకండ్ సింగిల్.. మరో మాస్ నంబర్ లోడింగ్..!

ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ బ్యాన‌ర్‌ల‌పై డా.ఈశారి కె గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీక్వెల్ లో నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించబోతుంది. అజ్మల్ ఖాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు