UK: భార్యను చంపి మృతదేహాన్ని..224ముక్కలుగా నరికి..బ్లాస్టిక్ బ్యాగులో కుక్కి..!

ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 224 ముక్కలుగా నరికాడు. ప్లాస్టిక్ బ్యాగులో కుక్కి కొన్ని రోజులు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి ఆ బ్యాగును నదిలో పడేయమని చెప్పాడు. ఈ దారుణ ఘటన బ్రిటన్ లోని లింకన్ నగరంలో జరిగింది.

New Update
UK: భార్యను చంపి మృతదేహాన్ని..224ముక్కలుగా నరికి..బ్లాస్టిక్ బ్యాగులో కుక్కి..!

UK Man Chops Wife’s Body Into 224 Pieces: ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కట్టుకున్న భర్త కాలయముడిగా మారుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరోకొటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 224 ముక్కలుగా నరికి ఓ ప్లాస్టిక్ బ్యాగులో కొన్ని రోజులపాటు దాచాడు. ఆ తర్వాత స్నేహితుడికి డబ్బులు ఇచ్చి ఆ బ్యాగును నదిలో పడేశాడు. ఆ నరరూప రాక్షసుడిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఆ ఘటన బ్రిటన్ లోని లింకన్ నగరంలో చోటుచేసుకుంది. 28ఏళ్ల నికోలస్ మెట్సన్, 26ఏళ్ల హోలీ బ్రామ్లీకి 2021లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన 16 నెలలకే ఆ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి.

అయితే గతేడాది మార్చిలో ఇంటికి వచ్చిన బ్రామ్మీ తర్వాత కనిపించలేదు. ఆందోళన చెందిన ఆమె తల్లి, సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి 24న నికోలస్ అపార్ట్ మెంట్ కు వెళ్లిన పోలీసులు..అతన్ని తన భార్య గురించి అడిగారు. అయితే ఆమె తనమీద గ్రుహహింసకు పాల్పడిందని..తన చేతిని కొరికిందని ఆరోపించాడు. మార్చి 19న స్థానిక మానసిక ఆరోగ్య ఆరోగ్య బృందంతో కలిసి ఇంటి నుంచి వెళ్లినట్లు చెప్పాడు. మరోసారి మర్నాడు పోలీసులు నికోలస్ ఇంటికి వెళ్లారు. లోపలంతా సెర్చ్ చేశారు. బాత్ రూమ్ లోని టబ్ లో రక్తం మరకలున్న బెడ్ షీట్లు, బెడ్ రూమ్ నేలపై రక్తం మరకలు, కిచెన్ లో రంపాన్ని చూశారు. రసాయనాల వాసనలను గమనించిన నికోలస్ ను ఆరా తీశారు. బెడ్ కింద దాక్కున్న తన భార్య రూమ్ క్లీన్ చేసి ఉంటుందని జోక్ వేశాడు. దీంతో భార్యను హత్య చేశాడన్న అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

2023 మార్చి 25న నదిలో తేలుతున్న ప్లాస్టిక్‌ బ్యాగులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బ్యాగులను పరిశీలించగా 224 ముక్కలుగా నరికిన మానవ శరీర భాగాలు ఉన్నాయి. అవి బ్రామ్లీ శరీర భాగాలుగా గుర్తించిన పోలీసులు... పలుమార్లు కత్తిలో పొడిచి భార్యను చంపినట్లు అంచనాకు వచ్చారు.
అయితే మార్చి 25న అరెస్ట్‌కు ముందు నికోలస్‌ ఆ ప్లాస్టిక్‌ బ్యాగులను లిఫ్ట్‌ నుంచి అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. భార్య ఖాతా నుంచి డ్రా చేసిన 50 డాలర్లు స్నేహితుడైన 28 ఏళ్ల జాషువా హాన్‌కాక్‌కు ఇచ్చాడు. అతని సహాయంతో వాటిని కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు పోలీసులు. నికోలస్‌, అతడికి సహకరించిన స్నేహితుడ్ని దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  ఉగాది నాడు పంచాంగ శ్రవణం ఆనవాయితీ.. అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు