పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ మొదలైన రోజు నుంచే మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తూ వచ్చాయి. లోక్ సభ, రాజ్యసభలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. మణిపూర్(manipur)లోని పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండుపై విపక్ష కూటమి ‘ఇండియా’ సభ్యులు తమ పట్టు వీడలేదు. పైగా మోదీ ప్రభుత్వంపై వారు అవిశ్వాస తీర్మానం కూడా తెచ్చారు. గత సోమవారం రాత్రి అంతా పార్లమెంట్ బయట ధర్నాకు కూర్చున్నారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరి రభసతో శుక్రవారం లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది
పూర్తిగా చదవండి..8 రోజులుగా అదే తంతు…ఉభయసభలు మళ్లీ వాయిదా
పార్లమెంట్ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు ప్రతిరోజూ డిమాండ్ చేస్తుండగా..కేంద్రం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విపక్ష పార్టీలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి.

Translate this News: