8 రోజులుగా అదే తంతు...ఉభయసభలు మళ్లీ వాయిదా పార్లమెంట్ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు ప్రతిరోజూ డిమాండ్ చేస్తుండగా..కేంద్రం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడకపోవడంతో విపక్ష పార్టీలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయసభలు మరోసారి వాయిదా పడ్డాయి. By M. Umakanth Rao 28 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ మొదలైన రోజు నుంచే మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తూ వచ్చాయి. లోక్ సభ, రాజ్యసభలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. మణిపూర్(manipur)లోని పరిస్థితిపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండుపై విపక్ష కూటమి 'ఇండియా' సభ్యులు తమ పట్టు వీడలేదు. పైగా మోదీ ప్రభుత్వంపై వారు అవిశ్వాస తీర్మానం కూడా తెచ్చారు. గత సోమవారం రాత్రి అంతా పార్లమెంట్ బయట ధర్నాకు కూర్చున్నారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరి రభసతో శుక్రవారం లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని విపక్షాలు శుక్రవారం కూడా డిమాండ్ చేశాయి. అందరూ రభసకు దిగడంతో సభ సమావేశమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉభయ సభల్లో లిస్ట్‌కు నిర్దేశించిన అన్ని అంశాలనూ పక్కన బెట్టి మొదట మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అలాగే మోదీ ప్రభుత్వంపై తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగే తేదీని, సమయాన్ని లోక్ సభ స్పీకర్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయించాలని కూడా వారు కోరారు. అయితే సభలో ఏ బిల్లు పాస్ కాకుండా చూడాలన్నదే విపక్ష ఎంపీల ఉద్దేశంలా కనబడుతోందని, ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందేలా సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ (prahlad joshi) అన్నారు. మణిపూర్ అంశంతో పాటు ప్రధానమైన అంశాలపై చర్చకు తాము అంగీకరించామని, కానీ వారు హఠాత్తుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన నోటీసులు సమర్పించారని ఆయన చెప్పారు. విపక్షం నుంచి నిర్మాణాత్మక సలహాలు, సూచనలను తాము కోరుతున్నామన్నారు. అవసరమైనప్పుడు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు. సంప్రదాయాలను అణగదొక్కుతున్నారు అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో స్పీకర్ అనుమతించిన తర్వాత కూడా బిల్లులను ప్రభుత్వం ఆమోదిస్తోందని, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాయడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై ఈ పార్టీ ఎంపీ మనీష్ తివారీకి, మంత్రి సత్యేంద్ర నారాయణ్ సిన్హాకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు జరిగాయి. అంతకుముందు లోక్ సభ, రాజ్యసభల్లో విపక్ష సభ్యులు మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ వాయిదా తీర్మాన నోటీసులను అందజేశారు. పార్లమెంట్ బయట 'ఇండియా' కూటమి సభ్యులు కొంతసేపు నిరసనకు కూర్చున్నారు. 8రోజులుగా ఇదే తీరు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ మొదలైన రోజు నుంచే మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలంటూ విపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తూ వచ్చాయి. లోక్ సభ, రాజ్యసభలు చాలాసార్లు వాయిదా పడ్డాయి. మణిపూర్ లోని పరిస్థితిపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండుపై విపక్ష కూటమి 'ఇండియా' సభ్యులు తమ పట్టు వీడలేదు. పైగా మోడీ ప్రభుత్వంపై వారు అవిశ్వాస తీర్మానం కూడా తెచ్చారు. గత సోమవారం రాత్రి అంతా పార్లమెంట్ బయట ధర్నాకు కూర్చున్నారు. రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా వారు కోరుతున్నారు. వీరి రభసతో శుక్రవారం లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడగా,, రాజ్యసభ ఏకంగా సోమవారానికి వాయిదా పడింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి