Monkeypox Virus: మంకీపాక్స్ జీవితంలో ఒక్కసారే వస్తుందా..? ఈ వైరస్ సోకితే చనిపోతారా..? మంకీపాక్స్‌పై WHO అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది 2- 4 వారాలలో దానంతటదే నయమవుతుంది. By Vijaya Nimma 17 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Monkeypox Virus: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రపంచంలో అనేక కొత్త వైరస్‌లు ఉన్న.. వాటి కంటే కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపింది. తాజాగా ఇలాంటి వైరస్ ఒకటి భారత్‌లోని ప్రవేశించింది. ఆ వైరస్ పేరు మంకీపాక్స్‌వైరస్. ఇది ఆఫ్రికాలో ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది. 2022 తర్వాత ఎమర్జెన్సీగా ప్రకటించిన రెండో వ్యాధి ఇది. దీంతో 20కి పైగా దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కువ కాలం జీవించే అవకాశం అధికం: మంకీపాక్స్ వైరస్ ఆఫ్రికాలో 30 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో 600 మంది మరణించారు. అయితే తాజాగా మంకీపాక్స్ వ్యాధికి సంబంధించి సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో మరోసారి అనేక పుకార్లు వస్తున్నాయి. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత తప్పించుకోవడం కష్టం అవుతుందపి చాలా పుకార్లు ఉన్నాయి. కానీ దీనిని ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ వైరస్ పరిమిత సమయం వరకు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇది 2 నుంచి 4 వారాలలో దానంతటదే నయమవుతుంది. ఈ సమయంలో చికిత్స పొందడం అవసరం. ఇది నయం చేయలేని వ్యాధి అని చెప్పడం పూర్తిగా తప్పని నిపుణులు అంటున్నారు. జీవితంలో ఒక్కసారే మంకీపాక్స్ వస్తుందా: వ్యాధి సోకిన తర్వాత, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్లీ మంకీపాక్స్ వ్యాధి సోకే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. చాలా వైరల్ వ్యాధులలో ఇదే జరుగుతుంది. మీజిల్స్, ఎప్స్టీన్ వంటి వైరస్లు క్రమంగా పెరుగుతాయి. ఇది వచ్చిన తర్వాత జీవితకాలం కొనసాగే బలమైన రోగనిరోధకశక్తిని సృష్టిస్తుంది. దీని కారణంగా శరీరం వైరస్‌లను గుర్తించడం, వాటిని మళ్లీ పోరాడే మార్గాలను నేర్చుకుంటుంది. తద్వారా అవి శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా.? ఒక్కసారి తాగితే సీజన్ సమస్యలు పరార్ #monkeypox-virus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి