Monkeypox: అమ్మో మంకీ ఫాక్స్..హైదరాబాద్ కూడా అలెర్ట్ అవ్వాల్సిందే ! ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. బయట దేశాలలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయేవారు ఎక్కువ. దీంతో హైదరాబాద్ ప్రజలు అలెర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. By KVD Varma 16 Aug 2024 in తెలంగాణ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Monkeypox: మంకీ పాక్స్ గా మనం చెప్పుకుంటున్న Mpox వ్యాధి వ్యాప్తి పై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. తాజాగా స్వీడన్ లో కూడా మంకీ పాక్స్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆఫ్రికా దేశాల బయట కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశ ప్రజలతో లింక్ ఉన్న దేశాలలో హై ఎలర్ట్ ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆ రకంగా చూస్తే హైదరాబాద్ నగరంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకో చెప్పుకునే ముందు.. అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి? ఇది సోకితే ఏమవుతుంది? WHO ఎందుకు ఎలర్ట్ జారీ చేసింది తెలుసుకుందాం. మంకీ పాక్స్ లేదా Mpox అంటే.. Mpox అనేది మశూచి వంటి లక్షణాలతో కూడిన వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. దీనిని మొదట 1958లో కోతుల్లో కనుగొన్నారు. తరువాత 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవులలో ఈ వ్యాధిని గుర్తించారు. తరువాత ఈ వ్యాధి ఆఫ్రికా దేశాల్లో తరచూ కనిపిస్తూ వచ్చింది. 2003లో మొదటిసారిగా ఆఫ్రికా దేశాలకు బయట యూఎస్ లో ఈ వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధి రెండురకాలుగా ఉంటుంది. ఒకటి క్లాడ్ I. దీనిలో 10 శాతం మరణాల సంఖ్య నమోదు అయింది. ఇక రెండో రకం mpox క్లాడ్ II ఇందులో పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో మరణాల సంఖ్య 0.1 శాతంగా ఉంది. అంటే క్లాడ్ I మంకీపాక్స్ ప్రమాదకరమైనది అని అర్ధం అవుతుంది. లక్షణాలు.. వ్యాప్తి.. Monkeypox: ఈ వ్యాధి కోవిడ్ లా గాలిద్వారా వ్యాపించదు. వ్యాధి గ్రస్తులతో నేరుగా సంబంధం ఉండడం.. లైంగిక సంబంధం, గాయాలు ఉన్నవారిని తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. ఇది సాధారణ ఫ్లూ లా మొదట కనిపిస్తుంది. అందువల్ల ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని జాగ్రత్తగా వైద్య సలహాలు తీసుకునేలా చూడటం అవసరం. ఇక దీని లక్షణాల్లో శోషరస గ్రంథులు వాపు, జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, తీవ్ర బలహీనత కలుగుతుంది. అలాగే, జ్వరం ప్రారంభమైన 1-3 రోజులకు చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. వ్యాధి సోకకుండా జాగ్రత్తలు.. వ్యాధి సోకిన వారితో నేరుగా సంబంధాలు లేకుండా ఉండడం ముఖ్యం. అలాగే కొత్తవారితో లైంగిక సంబంధం ఏర్పరుచుకున్నపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గత 21 రోజులలో ఆఫ్రికా దేశాలకు వెళ్లివచ్చిన వారితో దగ్గరగా ఉండకూడదు. హైదరాబాద్ కు ప్రమాదం ఏమిటి? ఒక్క హైదరాబాద్ అనే కాదు ఆఫ్రికా దేశస్తులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలలో అప్రమత్తత అవసరం. హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఒక్క టోలీచౌక్ దగ్గరలోని పారామౌంట్ కాలనీలోనే దాదాపుగా 6వేల మందికి పైగా ఆఫ్రికన్లు నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిని ఆఫ్రికా కాలనీ అని కూడా పిలుస్తారు. వీరుకాకుంగా ఆఫ్రికా దేశాల నుంచి చదువుల కోసం ఉద్యోగాల కోసం వచ్చిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ కారణంగా ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో డేంజర్ బెల్స్ మోగించి.. ప్రపంచ దేశాలకు క్రమేపీ విస్తరిస్తున్న మంకీ పాక్స్ విషయంలో హైదరాబాద్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తాజగా అందుతున్న సమాచారం ప్రకారం మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లో కూడా మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అంటే.. మన పొరుగు వరకూ ఇది వచ్చేసింది. ఇక జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవు. విదేశీయులు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవలి కాలంలో అంటే 21 రోజులలో ఎవరైనా ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినా వారిని దగ్గరగా కలిసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదేమైనా వ్యాధి వచ్చే అవకాశాలు ఏమిటనేది తెలుసును కనుక అది మన దగ్గరకు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. #hyderabad #monkeypox మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి