Money Tips: రోడ్డుపై డబ్బులు దొరికితే శుభమా? అరిష్టమా? రోడ్డుపై డబ్బులు దొరికితే శుభ సంకేతంగా భావిస్తాం. ధనలక్ష్మి దొరకడం వల్ల ఆరోజు ఏ పనిచేసిన విజయం సాధిస్తామట. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు తీరుతాయట. మన జీవితంలోనూ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Money Tips: మీకు రోడ్డుపైన డబ్బులు దొరికాయా.. అయితే నీకు కష్టాలు తీరిపోతున్నాయి. అవునండి రోడ్డుపైన డబ్బులు దొరికిన వాళ్లకు త్వరలో ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఇది మనం సాధించబోయే పనిలో కూడా విజయాన్ని తెచ్చి పెడుతుందట. మీకు రోడ్డుమీద డబ్బులు దొరుకుతున్నాయా..? మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. దీనివల్ల మనకి ఎంతో డబ్బులు కూడా కలిసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు కొన్ని ఈ ఆర్టికల్‌లో చూద్దాం. పనిలో విజయం సాధిస్తామని అర్థం: మనిషి జీవితంలో డబ్బు ప్రధానం. డబ్బు లేనిదే ఏ పని చేయలేం, ఏ వస్తువు కొనలేము. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మనం సంతోషంగా జీవించాలన్న డబ్బు చాలా ముఖ్యం. అయితే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు డబ్బులు దొరుకుతాయి. ఇది ప్రతి ఒక్కరిలో జరిగే విషయమే. అయితే అలా దొరికిన డబ్బులు ఏం చేయాలి..? తీసుకోవచ్చా..? తీసుకోకూడదా? ఖర్చు పెట్టొచ్చా..? పెట్టకూడదా..? అనే విషయంపై చాలామందికి డౌట్స్ ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా దీనికి ఒక మంచి పని ఉన్నది. డబ్బు దొరికేతే అదృష్టాలు: హిందూమతం ప్రకారం.. రోడ్డుపైన డబ్బులు దొరికితే మనం చేసే పనిలో విజయం సాధిస్తామని అర్థమట. అయితే చైనాలో మాత్రం రోడ్డు మీద దొరికిన డబ్బులను వారి అదృష్టాన్ని మార్చుకోవడానికి ఉపయోగిస్తారట. రోడ్డుపై దొరికిన డబ్బులు మీరు ప్రారంభించబోయే కొత్త పనిలో గెలుపు సాధిస్తారని సంకేతకంగా అక్కడ ప్రజలు భావిస్తారట. కొందరైతే రోడ్డు మీద దొరికిన డబ్బులను ఏదైనా ఆలయంలో విరాళంగా ఇస్తారు. పొరపాటున కూడా వీటిని ఖర్చు చేయకూడదంటారు. ఒకవేళ చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్న సమయంలో ఒక నాణేలు, డబ్బులు దొరికితే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థమని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇలా రోడ్డు మీద డబ్బులు దొరికితే లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతారు. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఈ డబ్బులు సూచిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి! #money-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి