/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nusrat-jahan-shami-jpg.webp)
BJP Mulls Fielding Cricketer Mohammad Shami From Bengal : రానున్న లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ని బరిలోకి దింపాలని బీజేపీ(BJP) ఆలోచిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే షమీని బీజేపీ సంప్రదించింది కూడా. అయితే షమీ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికలలో పోటీ చేయమని బీజేపీ షమీని కోరినట్లుగా సమాచారం. బెంగాల్(Bengal) లోని బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి షమీని పోటీకి దింపాలని బీజేపీ భావిస్తోందట. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నుస్రత్ జహాన్(Nussrat Jahan) ఈ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సందేశ్‌ఖాలీ ప్రాంతం కూడా ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. సందేశ్‌ఖాలీ ఇటీవలి నిత్యవ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అక్కడి టీఎంసీ నేతల మహిళలపై లైంగిక దాడులతో పాటు భూములను కబ్జా చేసుకున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు TMC మాజీ నాయకుడు షాజహాన్ షేక్‌తో పాటు అతని అనుచరుల తమపై వేధింపులకు పాల్పడ్డారని నిరసనలు చేస్తున్నారు. షాజహాన్‌ను ఇటీవల అరెస్టు చేసి సీబీఐకి అప్పగించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nusrut-jahan-jpg.webp)
మరోసారి క్రికెటర్‌వైపే బీజేపీ చూపు:
మహ్మద్ షమీ పశ్చిమ బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. పశ్చిమ బెంగాల్(West Bengal) తో మహ్మద్ షమీకి ఉన్న అనుబంధం దృష్ట్యా అక్కడి నుంచి ఆయనకు టికెట్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. షమీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అంగీకరిస్తే అది సంచలనమే అవుతుంది. గతంలో టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ గంగూలీని బెంగాల్ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీతో గంగూలీకి మంచి సంబంధాలు ఉండడంతో ఆయన అందుకు అంగీకరించలేదని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా మరోసారి బెంగాల్‌లో క్రికెట్ క్రేజ్‌నే బీజేపీ నమ్ముకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బెంగాలీలకు ఆటలంటే మక్కువ ఎక్కువ.
షమీ పేరు ఉంటుందా?
ఇక ప్రస్తుతం షమీ గాయంతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు. వరల్డ్‌కప్‌లో స్టార్ బౌలర్ షమీనే. మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నా కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత అద్భుత ప్రదర్శన చేసిన షమీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇక ఇటీవల బీజేపీ 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి తర్వాత లిస్ట్‌లో ఎవరుంటారు? షమీ పేరు కూడా ఉంటుందానన్న టాపిక్ అటు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు ఇటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ హాట్‌హాట్‌గా నడుస్తోంది.
Also Read : యశస్వి రికార్డుల మోత తో ధర్మశాల దద్దరిల్లింది..