Pavithranath: విషాదంలో మొగలిరేకులు అభిమానులు... ఆ ప్రముఖ నటుడు కన్నుమూత

మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ(పవిత్రనాత్) కన్నుమూశారు. ఈ విషయాన్ని సీరియల్ నటి మేఘన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "పవి నువ్వు లేవనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఎమోషనల్ అయ్యారు". 

New Update
Pavithranath: విషాదంలో మొగలిరేకులు అభిమానులు... ఆ ప్రముఖ నటుడు కన్నుమూత

Pavithranath : బుల్లితెర పై కొన్ని సీరియల్స్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి 'మొగలిరేకులు'. 2008 లో మొదలైన ఈ సీరియల్ 5 సంవత్సరాల పాటు టాప్ TRPతో కొనసాగుతూ సంచలనం సృష్టించింది. ఇక సీరియల్ లోని నటీ నటులను కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. శాంతి, ధర్మ, స్రవంతి, దయ, సెల్వ స్వామీ, ఈశ్వర్, దుర్గ, ఇంద్ర పాత్రలను అంత త్వరగా మర్చిపోలేరు. అయితే తాజాగా ఈ సీరియల్ నటుడు దయా( పవిత్రనాథ్) కన్నుమూశారనే వార్త అభిమానులకు తీవ్ర  విషాదాన్ని మిగిల్చింది.

మొగలిరేకులు ఫేమ్ దయా కన్నుమూత

మొగలిరేకులు, చక్రవాకం సీరియల్ లో ఇంద్ర తమ్ముడిగా దయా పాత్రలో మెప్పించిన పవిత్రనాథ్ మరణించారు. ఈ విషయాన్నీ ఇంద్రనీల్ వైఫ్ నటి మేఘన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు షాక్ కు గురైయ్యారు. దయా చనిపోవడమేంటి.. అసలు ఏం జరిగింది ..? ఇదంతా ఎప్పుడు జరిగింది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. దయా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మేఘన పోస్ట్ 

"పవి.. నువ్వు లేవనే బాధను మేము వర్ణించలేకపోతున్నాము.. మా జీవితంలో నువ్వు ఎంతో ముఖ్యమైన వాడివి. ఇది నిజం కాకపోతే బాగుండని కోరుకుంటున్నాను. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము తమ్ముడు. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాము. ఇక నుంచి నిన్ను చాలా మిస్ అవుతాము. నీ అత్తకు శాంతి చేకూరాలి.. మీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి" అంటూ మేఘన ఎమోషనల్ అయ్యారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Advertisment
తాజా కథనాలు